శశికళకు ఐటీ షాక్: అధికారుల ముందు కృష్ణప్రియ, షకీల, వెనక్కి తగ్గిన చిన్నమ్మ ఫ్యామిలీ!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించిన మన్నార్ గుడి మాఫియా సభ్యులు ఇప్పుడు ఆదాయపన్ను శాఖ కార్యాలయం చూట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ కుటుంబ సభ్యులు బుధవారం ఐటీ శాఖ అధికారుల ముందు హాజరైనారు.

చిన్నమ్మ శశికళ వదిన ఇళవరసి కుమార్తెలు కృష్ణప్రియ, షకీల, జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్, ఆ రెండు సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు బుధవారం చెన్నైలోని నుంగంబాక్కాంలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయం చేరుకుని అధికారుల ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు.

కృష్ణప్రియ, షకీల, వివేక్, జాజ్ సినిమాస్, జయ టీవీ సీనియర్ అధికారులను వేర్వేవేరుగా విచారణ చేసిన ఐటీ శాఖ అధికారులు కొన్ని గంటల పాటు వారికి ప్రశ్నలు వేసి అనంతరం కార్యాలయం నుంచి ఇంటికి పంపించారు. ఈ సందర్బంగా కృష్ణప్రియ మీడియాతో మాట్లాడుతూ ఐటీ శాఖ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు.

Vivek’s sisters apper before IT sleuths in Chennai

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడితో ఐటీ శాఖ దాడులు జరిగాయా అని మీడియా ప్రశ్నిస్తే అలాంటిది ఏమీ లేదని, ఆదాయపన్ను శాఖ అధికారులు వారి డ్యూటీ వారు చేశారని కృష్ణప్రియ అన్నారు. కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చిక్కులు తప్పవని తెలుసుకున్న శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు.

వివేక్ మీడియాతో మాట్లాడుతూ ఐటీ శాఖ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు. తన భార్య కీర్తనాకు సంబంధించిన బంగారు నగలు రికార్డులు రెండు మూడు రోజుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులకు ఇస్తానని వివేక్ చెప్పాడు. వివేక్ మరో సోదరి షకీల మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Krishnapriya and Shakila, both sisters of Jaya TV and Jazz Cinemas CEO Vivek Jayaraman, on Wednesday appeared before the income tax officials following raids in their houses.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి