చెన్నైకి రాని గవర్నర్: శశికళ ప్రమాణ స్వీకారం వాయిదా

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. తమిళనాడు ఇంఛార్జి గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌ చెన్నై రానందును శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీలో ఉన్న విద్యాసాగర్‌రావు సోమవారం రాత్రి చెన్నైకి రాకుండా ముంబైకి చేరుకున్నారు. విద్యాసాగర్ రావు మహారాష్ట్రకు గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా, శశికళ, దివంగత జయలలితలపై ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో త్వరలోనే తీర్పును వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించిన నేపథ్యంలో గవర్నర్‌... శశికళతో ప్రమాణస్వీకారం చేయించే విషయంలో గవర్నర్‌ న్యాయసలహా కోరినట్లు సమాచారం.

VK Sasikala, Chief Minister To Be Or Not To Be? Governor Not On Board

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాలని కోరుతూ.. చెన్నైకి చెందిన సెంథిల్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

జయలలిత ఆస్తుల కేసులో శశికళ దోషి అని తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వస్తుందని.. అదే జరిగితే రాష్ట్రంలో మళ్లీ శాంతిభద్రతలు అదుపు తప్పే పరిస్థితి వస్తుందని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా, డీఎంకే అధినేత స్టాలిన్ కూడా శశికళ ప్రమాణాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ బయల్దేరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+