పన్నీర్ కు కన్నీరే మిగిలింది: రహస్య సమావేశం, ఇప్పుడు ఏం చేద్దాం?

చెనై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు శనివారం మద్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయ్యారు. చెన్నైలోని ఓ రహస్య ప్రాంతంలో పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశం అయ్యారని తెలిసింది.

చిన్నమ్మ శశికళను తమిళనాడు సీఎంగా చెయ్యాలని ఆమె అనుచరులు ఒంటికాలి మీద నిలబడ్డారు. ఆదివారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ సమావేశమై శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకోవడానికి రంగం సిద్దం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం తన అధికార పర్యటనలు కుదించుకున్నారని సమాచారం. వెంటనే తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో పన్నీర్ సెల్వం చర్చలు జరిపారని తెలిసింది. అయితే ఆదివారం శాసన సభ్యులు శశికళను సీఎంగా ప్రకటించకముందే ఓ నిర్ణయం తీసుకోవాలని పన్నీర్ సెల్వం తన సన్నిహితులకు చెప్పారని తెలిసింది.

VK Sasikala Natarajan to be the next cm of Tamil Nadu !

శశికళ అనుచరులు సీఎం పగ్గాలు చిన్నమ్మకు అప్పగించాలని ఒత్తిడి చెయ్యకముందే తాను రాజీనామా చేస్తే మంచిదని పన్నీర్ సెల్వం భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో పన్నీర్ సెల్వం ఈ విషయంపై చర్చించాలని ఆయన అనుచరులు పట్టుపట్టారని తెలిసింది.

తమిళనాడు సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరిస్తే పన్నీర్ సెల్వంకు ఏ పదవి కేటాయిస్తారు ? ఆయనను మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారా ? లేదా ? పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మంత్రుల మీద వేటు వేస్తారా ? అంటూ ఇప్పుడు తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+