చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sasikala: సెంట్రల్ జైల్లో లగ్జరీ లైఫ్ కేసు, చిన్నమ్మకు షరతులతో బెయిల్, ఇళవరసికి కూడా, అప్పట్లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ అలియాస్ వీకే శశికళ నటరాజన్ మరోసారి వార్తలోకి ఎక్కారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు సంవత్సరాలు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత ఏడాదిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలైనారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నుంచి విముక్తి పొందిన శశికళ మరో కేసులో ఆరోపలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జీవితం గడుపుతున్న సమయంలో జైలు సిబ్బందికి లంచాలు ఇచ్చి జైల్లో కూడా లగ్జరీ లైఫ్ అనుభవించారని శశికళ మీద కర్ణాటక ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కర్ణాటక సీనియర్ పోలీసు అధికారులతో పాటు శశికళ, ఆమె సమీప బంధువు ఇళవరసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో శశికళ, ఆమె సమీప బంధువు ఇళవరసికి బెంగళూరులో ప్రత్యేక ఏసీబీ కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చెయ్యడంతో ఇద్దరూ ఇప్పుడు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.

Russian Ukraine War: లక్ష మందిని పంపించేశాము, చేసిన పాపం ఊరికేపోదు, జెలెన్ స్కీ ఫైర్ !Russian Ukraine War: లక్ష మందిని పంపించేశాము, చేసిన పాపం ఊరికేపోదు, జెలెన్ స్కీ ఫైర్ !

 ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసు

ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ అలియాస్ వీకే శశికళ నటరాజన్ మరోసారి వార్తలోకి ఎక్కారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు సంవత్సరాలు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత ఏడాది ఫిబ్రవరి నెలలో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలైనారు.

 జైల్లో చిన్నమ్మ శశికళ లగ్జరీ లఫ్ ?

జైల్లో చిన్నమ్మ శశికళ లగ్జరీ లఫ్ ?

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ జైలు జీవితం గడిపే సమయంలో అక్కడి జైలు సిబ్బందికి భారీ మొత్తంలో లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నుంచి విముక్తి పొందిన శశికళ మరో కేసులో ఆరోప?లు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలతో కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారుల ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయం కర్ణాటకను కుదిపేసింది.

 కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

శశికళ జైలు సిబ్బందికి భారీ మొత్తంలో లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టు ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అప్పటి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారి క్రిష్ణకుమార్, సూపరెండెంట్ అనితా, జైలు సూపరెండెట్ సురేష్, సెక్యూరిటీ గజరన్ తో పాటు శశికళ, ఆమె బంధువు ఇళవరసి మీద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు చార్జ్ షీటు తయారు చేసి సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు.

 హైకోర్టును ఆశ్రయించిన అధికారులు

హైకోర్టును ఆశ్రయించిన అధికారులు

ప్రత్యేక కోర్టు విచారణను నిలిపివేయాలని కర్ణాటక పోలీసు అధికారులు క్రిష్ణకుమార్, అనితా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదవ ఆరోపి చిన్నమ్మ శశికళ, ఆరవ ఆరోపి ఇళవరి శుక్రవారం బెంగళూరులోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో షరతులతో బెయిల్ తీసుకున్నారు. మూడు లక్షల రూపాయల పూచికత్తు మీద శశికళకు, ఇళవరసి బెయిల్ తీసుకున్నారు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా పడింది. షరతులు ఉల్లంఘిస్తే శశికళ, ఇళవరసి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణలు అంటున్నారు.

 శశికళకు చీకటి రోజులు

శశికళకు చీకటి రోజులు

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ నటరాజన్ 2017 ఫిబ్రవరి 15వ తేదీన పోలీసుల ముందు లొంగిపోయారు. అప్పటి నుంచి శశికళ నాలుగు సంవత్సరాలు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించారు. 2021 జనవరిలో జైలు శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత ఏడాది బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలైనారు. జైలు నుంచి బయటకు వచ్చిన రోజు శశికళ కరోనా వైరస్ బారినపడ్డారు. చిన్నమ్మ శశికళకు 2017 నుంచి 2021 వరకు చీకటి రోజులు అని ఆమె బంధువులు, అనుచరులు ఇప్పటికీ అంటున్నారు.

English summary
VK Sasikala Special Treatment Case: VK Sasikala and Ilavarasi have been granted bail in Bengaluru court with a cash bond of 3 lakhs each. April 16th is the next hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X