వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని మనోహన్ సింగ్ కీలక సందేశం -తెలివిగా ఓటేయండి, పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే..

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తొలిసారి స్పందించారు. ఇంకొద్ది గంటల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుండగా, అస్సాం ఓటర్లను ఉద్దేశించి ఆయన కీలక సందేశమిచ్చారు. అస్సాం ప్రజలందరూ 'ఆలోచించి, తెలివిగా' ఓటేయాలని, రాజ్యాంగం మీద విశ్వాసం ఉంచే పార్టీలకు మాత్రమే ఓటు వేయాలంటూ శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు.

ఎంపీ అరవింద్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు -భైంసా అల్లర్లు -ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావనఎంపీ అరవింద్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు -భైంసా అల్లర్లు -ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావన

మోదీ నేతృత్వంలోని బీజేపీ ఏలుబడిలో ప్రస్తుతం సమాజం చాలా రకాలుగా చీలిపోయిందని, మతం, ప్రాంతం, వర్గం, భాష పేరుతో విభజన సృష్టించారని, సామాన్యుడి ప్రాథమిక హక్కులను కూడా హరించివేస్తున్నారని, దేశంలో ఓ భయానక పరిస్థితి నెలకొందని మన్మోహ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Vote for govt that upholds democracy: Manmohan Singhs Video Message for Assam Polls

మోదీ సర్కార్ తెచ్చిన జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడిదని, పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరతగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగాలు లేక చాలా మంది యువకులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, వారి జీవితాలు ఛిద్రమవుతున్నాయని మన్మోహన్ ఆవేదన చెందారు.

తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?తిరుపతి పోరు: రత్నప్రభ అనూహ్య స్పందన -పవన్ కల్యాణ్ షాకింగ్ తీరు -ఉమ్మడి కమిటీ ఉంటుందా?

''ఐదేళ్ల పాటు భారత ఆర్థిక మంత్రిగా, పదేళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవ చేసే అదృష్టాన్ని అసోం ప్రజలు కల్పించారు. మీలో ఒకడిగా నేను మాట్లాడుతున్నాను. మీకు ఓటు వేసే అవకాశం వచ్చింది. మీరు తెలివిగా, ఆలోచించి ఓటు వేయాలి. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకముంచే ప్రభుత్వానికే ఓటు వేయండి. ప్రతి పౌరుడి జీవితానికీ రక్షణ కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అసోంను శాంతిమార్గంలో, అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లే ప్రభుత్వానికే ఓటు వేయండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తూ మీ చేతుల్లోనే ఉంది'' అని మన్మోహన్ సింగ్ వీడియోలో పేర్కొన్నారు.

English summary
Former Prime Minister Manmohan Singh, in a video message to voters in Assam, has warned that their society is being divided on the basis of religion and language and urged them to vote for a government that “believes in the Constitution and democratic principles”. He said the Congress, if voted to power, will not implement the Citizenship (Amendment) Act (CAA) and will try its utmost to get it repealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X