వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతం పేరుతో ఓట్లడిగినట్టు నిరూపించాలి: గులాం నబీ ఆజాద్ సవాల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మతం పేరుతో తాను ఓట్లు అడిగినట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సవాల్ విసిరారు.

తాను ముస్లింల కోసం ప్రత్యేకంగా బహిరంగ సభను నిర్వహించలేదని చెప్పారు. కేవలం బహిరంగ సభను మాత్రమే నిర్వహించినల్టు చెప్పారు.

 Vote in name of Islam: Ghulam Nabi Azad says will quit as MP if proven guilty

తాను ఇస్లాం పేరుతో ఓట్లు అడిగినట్టు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. తనపై ఎన్నికల కమిషన్ కు తప్పుడు ఫిర్యాదు చేశారని గులాం నబీ ఆజాద్ విమర్శించారు.

దీనికి సంబంధించిన వీడియో కానీ, ఆడియో కానీ ఉంటే చూపించాలన్నారు. తాను నేరం చేసినట్లు రుజువు చేస్తే తన పార్లమెంటు సభ్యత్వానికి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానన్నారు.


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలోని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేసింది. గుల్బర్గ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రభు పాటిల్‌ తరపున గులాంనబీ ఆజాద్ ప్రచారం చేశారని తెలిపింది.

బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారని ఆరోపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదని ముస్లిం ఓటర్లకు చెప్పారని ఆరోపించింది. ముస్లింలు సామూహికంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరినట్లు ఆరోపించింది.బిజెపి నేతలు తనపై ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదు చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సవాల్ విసిరారు.

English summary
Under attack for allegedly inciting voters in poll-bound Karnataka on communal lines, senior Congress leader Ghulam Nabi Azad on Thursday said that he will resign as the Member of Parliament if he is proven guilty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X