యూపీ, బీహార్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. బీహార్‌లోని అరారియా లోకసభ ఉప ఎన్నికల్లో బీజేపీపై 57,358 ఓట్ల అధిక్యంతో ఆర్జేడీ గెలుపొందగా, యూపీలోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోకసభ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ గెలిచింది.
ఈ ఫలితాలపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీతో ప్రజలు విసిగిపోయారనే విషయం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం ఉన్న బీజేపీయేతర అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టారని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో తమ పార్టీ పునర్మిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే ఇది రాత్రికి రాత్రే జరిగే పని కాదన్నారు.












Click it and Unblock the Notifications