సజావుగా సాగుతున్న చివరి విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధాని మోడీ బరిలో ఉన్న వారణాసి సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో కలుపుకుని 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 10,01,75,153మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని 246వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఎండ తీవ్రత పెరగకముందే ఓటు వేయాలన్న ఉద్దేశంతో పలువురు ఓటర్లు ఉదయమే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు.

Voting begins for 59 parliamentary constituencies in the Final phase

గత ఆరు దశల ఎన్నికల్లో బెంగాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అక్కడ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలను మోహరించింది. చివరి దశ పోలింగ్‌లో దేశంలో అందరి దృష్టి ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిపైనే ఉంది. ఇక్కడ మోడీతో పాటు మరో 25 మంది బరిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+