10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు -మధ్యప్రదేశ్‌లో 66శాతం పోలింగ్
బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల రెండో దశతోపాటే దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని దుబ్బాక, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఝార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు పోలింగ్ నిర్వహించింది. దాదాపు అన్ని చోట్లా ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా ముగిసింది.
అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాల్లో 66.09 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సమయంలో 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, అందకు ముందే ఖాళీగా ఉన్న మూడ సీట్లు కలిపి మధ్యప్రదేశ్ లో 28 స్థనాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. వీటిలో కనీసం తొమ్మిదింటిలో బీజేపీ గెలిస్తేనే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం మనగలుగుతుంది. మెజార్టీ అటుఇటు అయితే అధికారం మళ్లీ కాంగ్రెస్ హస్తగతం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం..
10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. బీహార్ అసెంబ్లీ సహా 54 బై పోల్ ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications