Lakhimpur Kheri : ఈవీఎంలో ఫెవిక్విక్ పోసిన దుండగులు-పోలింగ్ కు స్వల్ప అంతరాయం

ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది.ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు వేసేందుకు 58 నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల నాటికి 22 శాత పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

నాలుగోదశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో కీలకమైన లఖీంపూర్ ఖేరీ కూడా ఉండటంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఊహించినట్లుగానే లఖీంపూర్ లో పోలింగ్ ను దుండగులు టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడ అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం నేపథ్యంలో దుండగులు ఈవీఎం మెషీన్ పై ఫెవిక్విక్ పోసి పోలింగ్ కు అంతరాయం కలిగించడంతో కలకలం రేగింది. వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. మరో ఈవీఎం మెషీన్ ను తెప్పించి పోలింగ్ పునఃప్రారంభించారు.

Voting resumed in Lakhimpur Kheri after ruckus over Fevikwik thrown on EVM in up polls

లఖీంపూర్ ఖేరీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)పై ఫెవిక్‌విక్ విసిరిన తర్వాత రచ్చ చెలరేగింది. అక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వారు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు జోక్యం చేసుకున్నారు. దీంతో పోలింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 నాలుగో దశలో ఓటింగ్ జరుగుతున్న లఖింపూర్ ఖేరీలోని కడిపూర్ సాని ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రచ్చ జరగడంతో ఈవీఎంను మార్చిన తర్వాత ఓటింగ్ ప్రారంభమైంది.

గతేడాది లఖీంపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై బీజేపీకి చెందిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లడంతో పలువురు రైతులు చనిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో రైతులు బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీంతో లఖీంపూర్ ఖేరీలో రైతుల్ని ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో కొందరు బీజేపీ కార్యకర్తలు పోలింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+