గుడ్ న్యూస్: రైలు టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదా? డోంట్ వర్రీ.. విమానంలో పంపిస్తారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ-1, ఏసీ -2 వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణికులను విమానంలో పంపించాలని యోచిస్తున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహాని వెల్లడించారు.

రాజధాని రైళ్లలో ప్రయాణికుల రద్దీ వల్ల ఏసీ -2 టికెట్లు కన్ఫర్మ్ కావడం లేదని అలాంటి వారిని విమానాల్లో పంపించి విమానాల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చూస్తామని అశ్వనీ పేర్కొన్నారు.

 Wait-listed on Rajdhani? You may just get a free flight on Air India

వెయిటింగ్ లిస్టులో ఉండి కన్ఫర్మ్ కాని రాజధాని రైలు ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల వివరాలు ఎయిర్ ఇండియాకు పంపిస్తామని వారు ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే వారిని వారి గమ్యస్థానాల్లో దింపేలా చూస్తామన్నారు.

ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఎయిర్ ఇండియాకు పంపించామని రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు. అయితే రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ చేసిన ప్రతిపాదనపై తాను ఇప్పుడే మాట్లాడనని, ఎందుకంటే రైల్వేకు, విమాన చార్జీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఎయిర్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ బన్సాల్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Maharaja will soon come to help wait-listed passengers of Rajdhani trains as such travellers will be provided with the option to fly by Air India by paying little extra. Air India and IRCTC have already entered into a pact for the proposed arrangement which is expected to be in place “within a week”, the carrier’s chief Ashwani Lohani told PTI. Under the proposed arrangement, people who have unconfirmed tickets across classes on Rajdhani trains would have the choice of boarding an Air India flight, provided the airline has services in the particular train route chosen by the passenger. Air India tickets would be offered to such passengers through IRCTC. Lohani, who is Air India Chairman and Managing Director, said details are being worked out and the arrangement is expected to be in place “within a week”.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి