అప్‌సెట్: కేజ్రీని కారు ఇచ్చేయన్నటెక్కీ ఉద్దేశ్యం అదే, ఇప్పుడు లోగో

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలోని విభేదాల పైన ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా అప్ సెట్ అవుతున్నారు. అలాగే అసంతృప్తికి లోనైన ఓ అభిమాని గతంలో తాను ఇచ్చిన కారును, ఫండ్‌ను తిరిగి ఇచ్చివేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. అయితే, తన అసలు ఉద్దేశ్యం కారు, డబ్బులు తిరిగి వెనక్కి తీసుకోవడం కాదని ఆయన ఆంగ్ల మీడియా సంప్రదించగా చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ పార్టీ మద్దతుదారులు షాకిస్తున్నారు! పార్టీలోని ప్రస్తుత పరిణామాల (విభేదాలు) నేపథ్యంలో తాము 2013 జనవరిలో కేజ్రీవాల్‌కు ఇచ్చిన వాగనర్ వాహనాన్ని తిరిగి ఇచ్చిన వేయాలని డిమాండ్ చేయడం గమనార్హం.

ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌ల తొలగింపు పైన కుందన్ శర్మ అనే సాఫ్టువేర్ ఇంజనీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతను తన కారును వెనక్కి ఇవ్వాలని ట్వీట్ చేశారు. తాను డొనేట్ చేసిన బ్లూ కలర్ వాగనర్‌ను, బైకులను, లక్షలాది రూపాయలను తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు.

Want donated WagonR back: Upset AAP supporter to Kejriwal

'స్వచ్ఛ రాజకీయాలు' అనేది తమ కల అని ఆ టెక్కీ వాపోయారు. ఆ కల నెరవేరడం కోసమే ఢిల్లీ ఎన్నికల్లో ఏఏపీ గెలుపు కోసం ఎంతో చేశామన్నారు. కానీ మరో మూడు దశాబ్దాల వరకు ఎవరు కూడా స్వచ్ఛ రాజకీయాలు తీసుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

అయితే మీడియా ఆయనను సంప్రదించగా... కారు, తన డబ్బులు తిరిగి తనకు కచ్చితంగా ఇచ్చివేయాలనేది తన అసలు ఉద్దేశ్యం కాదని, కానీ పార్టీలోని తీరు తమను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూషణ్, యోగంద్రల పైన వేటు తమను అసంతృప్తికి గురి చేసిందన్నారు.

పార్టీ లోక్‌పాల్ విచారణ లేకుండా వారిద్దరి పైన వేటు ఎలా వేశారని ప్రశ్నించారు. తాను ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వం రావాలని మాత్రమే ఆ పార్టీకి మద్దతివ్వలేదని, ఇప్పటి వరకు రాని కొత్త ప్రభుత్వం కనిపించాలని మద్దతిచ్చానని చెప్పారు. కానీ అలా జరగడం లేదని వాపోయారు. తాను ఇచ్చిన కారును, డబ్బులను తిరిగి తీసుకునేంత చీప్‌గా తాను ఆలోచించనని చెప్పారు.

వాగనార్ తర్వాత లోగో

వాగనార్ తర్వాత కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. తన ఆమ్ ఆద్మీ పార్టీ లోగో వెనక్కి ఇచ్చేయాలని సునీల్ లాల్ అనే పార్టీ వాలంటీర్ డిమాండ్ చేశారు. ఏఏపీ లోగోను తానే డిజైన్ చేసినట్లు చెప్పారు. దానిని ఇక నుండి ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+