కోటి ఫ్యామిలీలకు పైపుల ద్వారా వంటగ్యాస్: ప్రధాని మోడీ, 29న లీ అంత్యక్రియలకు హాజరు

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ రాయితీ వదులుకునే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ నగదు బదిలీతో వంట గ్యాస్ రాయితీలో లీకేజీని అరికట్టామన్నారు. దేశ వ్యాప్తంగా 2.8 లక్షల మంది ఎల్‌పీజీ రాయితీ వదులుకున్నారని అన్నారు.

ఎల్‌పీజీ రాయితీ వదులుకోవడం వల్ల రూ. 100 కోట్లు ప్రజాధనం ఆదా అయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. మార్కెట్ ధరకు ఎల్‌పీజీ గ్యాస్‌ను కొనుక్కునే స్ధోమత కలిగి ఉన్న వారు రాయితీని వదులుకుంటే మంచిదని సూచించారు.

రాబోయే నాలుగేళ్లలో దేశంలోని కోటి ఫ్యామిలీలకు పైపుల ద్వారా వంట గ్యాస్ కనెక్షన్ అందిస్తామన్నారు.

సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరు

 Want gas supply via pipelines for one crore households : PM Modi

సింగపూర్ ఆధునిక పితామహుడు, మాజీ ప్రధాని లీ కున్ యూ అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరవుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. లీ కున్ యూ అంత్యక్రియలు మార్చి 29న సింగపూర్‌లో నిర్వహించనున్నారు.

సింగపూర్ దేశానికి తొలి ప్రధానిగా 1990లో బాధ్యతలు చేపట్టిన ఆయన 31 ఏళ్లపాటు సేవలందించారు. మార్చి 23న ఆనారోగ్యంతో కన్నుమూశారు. లీ కున్ యూ 1923 సెప్టంబర్ 16న జన్మించాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టా పొందారు.

పీపుల్స్ యాక్షన్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. సింగపూర్ అన్ని రంగాల్లో అబివృద్ధి చెందడానికి ఆయన విశేష కృషి చేశారు. అందుకే ఆయన్ని సింగపూర్ ఆధునిక పితామహుడుగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+