Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఆర్‌సీటీసీ ‘లక్కీ ఛాన్స్’: రూ.10వేలు గెలుచుకునే అవకాశం

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు ఓ లక్కీ ఛాన్స్ ఆఫర్ అందిస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు రూ. 10వేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆధార్ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ లక్కీ డ్రా స్కీమును ప్రవేశపెట్టాయి.

లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఐఆర్‌సీటీసీ వారి మొబైల్ నెంబర్‌కు మెసేజ్ ద్వారా తెలియజేస్తుంది. ఈ స్కీం ప్రకారం ప్రయాణికులు ఎవరైతే ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్కెట్ తీసుకుంటారో వారు తమ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీకి తమ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వారికి లక్కీ డ్రాలో పాల్గొనే అర్హత లభిస్తుంది.

Want to win Rs 10,000? New scheme by IRCTC gives this chance; what Indian Railways passengers need to do

మే రెండో వారంలో ప్రయాణించే వారి నుంచి ఐదుగురిని ఎంపిక చేసి రూ. 10వేలు అందించనున్నారు. అంతేగాక, వారి రైలు ప్రయాణ టిక్కెట్టుకు అయిన మొత్తం ఖర్చులను సైతం వెనక్కి ఇచ్చేస్తారు. అయితే, దీనికి ఐఆర్‌సీటీసీలో నమోదు చేసుకున్న వారే అర్హులు.

కేవైసీకి తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకుని ఉండాలి. టిక్కెట్‌లో పేర్కొన్న ప్రయాణికుల జాబితాలో కనీసం ఒక్క పేరుతో అయినా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ప్రొఫైల్ పేరు లేదా ప్రయాణికుడుి పేరు సరిపోవాలి. అయితే, తమ టిక్కెట్ రద్దు చేసుకున్నా.. లేదా టీడీఆర్ ఫైల్ చేసుకున్నా.. ఆ ప్రయాణికులు ఈ స్కీంకు అనర్హులే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+