రూ.200 కోట్ల డీల్! బ్లాక్ సూట్ కేస్ తో హార్దిక్ పటేల్, రాహుల్ గాంధీతో ఒప్పందం?
అహ్మదాబాద్‌లోని ఓ హోటల్ లో హార్థిక్ పటేల్, రాహుల్ గాంధీ భేటీ అయిన విషయం తెలిసిందే. వెనుదిరిగి వెళుతున్న హార్దిక్ పటేల్ చేతిలో ఓ బ్లాక్‌సూట్‌కేస్ ఉండడంతో.. దాని నిండా..
న్యూఢిల్లీ : హార్ధిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే సంచలనంగా మారగా, తాజాగా రాహుల్‌ని కలిశాక.. హార్థిక్ పటేల్.. తిరిగి వెళుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కారణం, వెనుదిరిగి వెళుతున్న హార్దిక్ పటేల్ చేతిలో ఓ బ్లాక్‌సూట్‌కేస్ ఉండడంతో.. దాని నిండా.. డబ్బు ఉందని, రాహుల్ ఇచ్చిన డబ్బు ఉన్న సూట్ కేసుతో హార్ధిక్ పటేల్ వెనుదిగిరిగి వెళుతున్నాడంటూ సోషల్ మీడియాలో గుప్పుమంది.

అహ్మదాబాద్‌లోని ఓ హోటల్ లో హార్థిక్ పటేల్, రాహుల్ గాంధీ భేటీ అయిన విషయం తెలిసిందే. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ మద్దతు ప్రకటించినందుకు ఈ మొత్తాన్ని రాహుల్ బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూసింది.
రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్ మధ్య రూ.200 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందని.. అందుకే హార్థిక్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ అంశంలో ఏది నిజమో?.. ఏది అబద్దమో? తెలియక సామాన్యులు అమోమయానికి గురవువుతున్నారు. మరోవైపు.. సీసీటీవీ ఫుటేజ్ లీక్ అవడం అనేది వ్యక్తిగత ప్రైవసీ పాలసీకి విరుద్ధమంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications