సరిపోయింది.. వీళ్లిద్దరు కొట్టుకుని మధ్యలో సీఎం మీద పడతారేంటీ

బెంగళూరులోని నమ్మ మెట్రో స్టేషన్‌లో ఇద్దరు మహిళల మధ్య చోటు చేసుకున్న వాదులాట ఎక్కడికెక్కడికో దారి తీసింది. అటు తిరిగి- ఇటు తిరిగి.. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ తిరిగింది. "సిద్ధరామయ్య తరఫు బంధువువా, లేక ఆయనకు చెందిన మహిళవా.." అంటూ ఇద్దరు పరస్పరం దూషించుకున్నారు. ఆగ్రహావేశలకు లోనయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కన్నడంలో మాట్లాడాలనే డిమాండ్ తో ఈ వివాదం మొదలైంది. ఇద్దరు మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగడం ఈ వీడియోలో కనిపించింది. టికెట్ కౌంటర్ వద్ద ఒక ప్రయాణికురాలు కన్నడలో మాట్లాడటానికి ప్రయత్నించగా, మరొకరు హిందీలో స్పందించడంతో ఈ వాగ్వాదం మొదలైంది. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న వీడియో ఇది. బురఖా ధరించిన మహిళ హిందీలో మాట్లాడటంతో.. అది అర్థం కాని మరో మహిళ పదే పదే కన్నడలో మాట్లాడమని డిమాండ్ చేయడం ఇందులో రికార్డయింది.

Watch Bengaluru Metro Argument Between Two Women Over Kannada Sparks Online Debate

దీనికి సమాధానంగా.. బురఖా ధరించిన మహిళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేరును ప్రస్తావించింది. "తూ ఔరత్ హై క్యా సిద్ధరామయ్య కీ?" (నువ్వు సిద్ధరామయ్యకు చెందిన ఆడదానివా?) అని ప్రశ్నించడం చూడొచ్చు. ఈ వీడియో వైరల్ అయింది. విపరీతంగా షేర్ అయింది. వేల సంఖ్యలో కామెంట్లు పడుతున్నాయి. అదే స్థాయిలో రీట్వీట్లు, రీ పోస్టింగులు సాగుతున్నాయి. కన్నడ భాషా అభిమానులు ఈ వీడియోను వైరల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

"మహిళా భాషా యోధులు పోరాడటం మొదటిసారి చూస్తున్నాను" అని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. మరొకరు మతాన్ని తెచ్చాడీ వివాదంలోకి. "భాష ముఖ్యమా లేక మతం ముఖ్యమా అనేది ఎవరికైనా సమాధానం చెప్పడం కష్టమైన ప్రశ్న.." అని రిప్లై పెట్టాడు. "స్థానిక భాషలో మాట్లాడాలనే డిమాండ్ ఇప్పుడు మహిళల్లో కూడా ఊపందుకుంటోంది.." అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇవ్వక తప్పదని, కనీసం మాట్లాడటానికైనా ప్రయత్నించాలని సూచించాడు.

కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భాషాపరమైన ఘర్షణలు తరచూ చెలరేగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. స్థానికులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటోన్నాయి. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడటానికి నిరాకరించినందుకు హిందీ మాట్లాడే కొంతమందిపై గతంలో దాడులు సైతం జరిగాయి. కర్ణాటక దుకాణాల బోర్డుల్లో కనీసం 60 శాతం కన్నడం తప్పనిసరి. దీనిని పాటించని బోర్డులను కన్నడ భాషాభిమానులు ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+