వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:తాబేలుకు గేదె సాయం.. ఇసుకలో కూరుకుపోతే తిప్పి.. వైరల్

|
Google Oneindia TeluguNews

మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ మానవత్వం ఉంటుందని ఇదివరకు తెలుసుకున్నాం కదా.. ఓ గజరాజు నదిలో కొట్టుకుపోతున్న ఘటన గురించి తెలుసుకున్నాం.. అదీ పాత వీడియో.. కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. అవును ఓ గేదె కూడా తోటి జీవికి సాయం చేసింది. అదీ తాబేలు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు.. కానీ వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

తాబేలును తిప్పిన గేదె

తాబేలును తిప్పిన గేదె

ఓ గ్రౌండ్.. అందులో ఇసుక ఉంది. అక్కడ గేదె.. దాంతోపాటు తాబేలు కూడా ఉంది. ఆ ఇసుకలో బొర్లపడిన తాబేలు తిరిగి యథాస్థానానికి రాలేకపోతుంది. దీనిని ఆ గేదె గమనించింది. ఇంకేముంది తన కొమ్ములతో ఆ తాబేలును సరి చేసింది. ఘటన జరుగుతున్న సమయంలో.. పక్కన చాలా మంది ఉన్నారు. తాబేలు చేసిన సాయం చూసి వారంతా కేకలు పెట్టారు. వావ్.. అని తెగ అరిచారు.

వీడియో వైరల్

వీడియోను డాగ్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఇన్ స్టాగ్రామ్‌లో జూన్ 21వ తేదీన షేర్ చేసింది. ఇంకేముంది అదీ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు 5.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 19 వేల లైకులు వచ్చాయి. చాలా మంది యూజర్లు కామెంట్ చేస్తున్నారు. వావ్.. ఆ గేదె చేసిన మంచి పని అని అంతా అంటున్నారు. దానికి కూడా సాయం చేసే మంచితనం ఉందని అంటున్నారు. ఆ తాబేలు మాత్రం.. కష్టపడి ఊరుకుంది. చివరికీ గేదె సాయంతో ఎప్పటి స్థానానికి చేరుకుంది.

నెటిజన్ల కామెంట్స్

నెటిజన్ల కామెంట్స్

ఇది తనకు అర్థమైందని.. మీకు కూడా అర్థమైందా అని కామెంట్ చేశారు. తాబేలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ కంటెంట్ జనం కూడా తెగ చూస్తున్నారు. గత నెలలో మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇలా చాలా తాబేళ్లకు సంబంధించిన వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. ఇవాళ మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

English summary
video is taking rounds on the internet where a turtle is seen flipped on its back while a buffalo standing nearby helps by flipping it over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X