వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:గుండె గుబేల్, ముంబైలో ఓ ఇంటిపై పిడుగుపాటు, వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

గత రెండు రోజుల నుంచి భారీ వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్షాలకు తోడు.. ఉరుములు, మెరుపులు కూడా బాగా ఉన్నాయి. నిన్న హైదరాబాద్‌లో ఉరుములు మాములుగా లేవు. అదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా అలానే పరిస్థితి ఉంది. అయితే పిడుగు వేసే సమయంలో ఒకరు వీడియోను తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్రాక్‌లపై నీరు..

ట్రాక్‌లపై నీరు..

వర్షాలతో సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. ట్రాక్‌లపై వర్షపునీరు చేరడంతో.. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. చాలా మంది వర్షాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. అయితే ఒకరు మాత్రం పిడుగుపాటు వీడియోను వేశారు. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. బోరివాలిలో ఘటన జరగగా.. ఇప్పటికే ఆ వీడియోను 70 వేల మంది చూశారు. వీడియో నిడివి కూడా 8 సెకన్లు ఉంది. అదీ భయానకంగా ఉంది.

బిల్డింగ్‌పై పిడుగు

పిడుగు పడే భవనానికి ఇనుప కవచం ఏర్పాటు చేశారు. దీంతో ఆ పిడుగు నేరుగా నేలపై పడింది. లేదంటే భవనంలో ఉన్నవారికి ప్రమాదం జరిగి ఉండేది. ఈ మేరకు ఒకరు ట్వీట్ చేశారు. వర్షకాలంలో పిడుగులు కామనే కానీ.. కొన్నిసార్లు జనం కూడా మృత్యువాత పడతారు. ఏటా వందలాది మంది చనిపోతారు. 2019లో 2900 మంది తిరిగి రానీ లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఏట జైపూర్‌లో గల అంబర్ పోర్టులో 11 మంది చనిపోయారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పిడుగుపాటు ఉంటుంది. 2020లో కూడా పిడుగులు భారీగా పడ్డాయి.

సాయంత్రం భారీ వాన

సాయంత్రం భారీ వాన


ముంబైలో నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి వర్షం కురిసింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు దాని ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్ల వర్షం పడింది. సాయంత్రం 6.30 గంటల తర్వాత వర్ష ప్రభావం తగ్గుతూ వచ్చింది. అందుకే సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. వర్షం నేపథ్యంలోనే ట్రాఫిక్ నిలిచిపోయింది.

English summary
Heavy rains lashed Mumbai and its adjoining areas on Thursday evening. One of those videos shows an incredible lightning strike on a Mumbai building
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X