ఘోరం: యువకుడి కిడ్నాప్.. చిత్రహింసలు, పోలీసులు వెళ్లినా.., (వీడియా)
జైపూర్: రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిని కిడ్నాప్ చేయడమేకాక అతడ్ని చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడ్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
బార్మర్ ప్రాంతంలో ఓ యువకుడు కొనవూపిరితో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడ్ని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడిని చిత్రహింసలు పెట్టిన నిందితుల కోసం గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఆ యువకుడిని వారు చిత్రహింసలు పెడుతున్న దృశ్యాలు లభించాయి. వ్యక్తిగత వివాదాల కారణంగానే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications