
Viral Video:మహాభారత ట్రాక్ పాడిన ముస్లిం వ్యక్తి.. పీఎఫ్ఐపై నిషేధం నేపథ్యంలో..
ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పీఎఫ్ఐ ఇటీవల ఎన్ఐఏ వరస దాడులు చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం కూడా విధించింది. అయితే ఓ ముస్లిం వ్యక్తి మాత్రం మహాభారత టైటిల్ సాంగ్ పాడుతున్నారు. ఇదీ పాతదని ఒకరు.. లేదు కొత్తదే వైరల్ అని మరొకరు అంటున్నారు. మీరు ఆ వీడియోను ఓ సారి చూడండి.
గడ్డం నెరిసిన ముస్లిం వ్యక్తి మహాభారత టైటిల్ ట్రాక్ పాడారు. పీఎఫ్ఐ నిషేధం విధించిన తర్వాత అతను పాడారని కొందరు అంటున్నారు. కానీ కొందరు పాతదే అని చెబుతున్నారు. కావాలంటే ఫ్యాక్ట్ చెక్ చేయాలని సూచిస్తున్నారు.

సదరు వ్యక్తి ముస్లిం కావడంతో వివాదం చెలరేగింది. అందరూ ముస్లింలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవు కదా అనేవారు కూడా ఉన్నారు. నిజమే.. కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి నిషేధం విధించిన తర్వాత అదే కమ్యునిటికీ చెందిన వ్యక్తి పాట పాడటం చర్చకు దారితీసింది.
Beating the stereotypes! pic.twitter.com/BwhfqMbTjV
— Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) September 20, 2021
గత నెల 22వ తేదీన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే 100 మంది ఆ పార్టీ నేతలను అరెస్ట్ కూడా చేసింది. ఇంతలో ఒకతను మహాభారత టైటిల్ ట్రాక్ పాడటంతో చర్చకు దారితీసింది.