వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:ఇదేమి విచిత్రం, స్టేషన్ వద్ద గాల్లోకి విసిరేస్తోన్న పార్సిల్స్, వైరల్..

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అవును ఈ కామర్స్ సైట్ ద్వారా డైలీ నీడ్స్ కొనుగోలు చేస్తున్నారు. మెట్రో పాలిటన్ నగరాల్లో అయితే మరీను.. అయితే మరీ ఆ డెలివరీ ఎలా జరుగుతుందో తెలుసా..? ఎక్కడ ఢిల్లీ, ఘజియాబాద్ నుంచి మారుమూల ప్రాంతాలకు డెలివరీ జరుగుతుంది. అయితే ఓ రైల్వేస్టేషన్ వద్ద ఆ పార్సెల్స్ విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. మీరు కూడా ఆ వీడియోను ఓసారి లుక్కేయండి.

వందలాది పార్సిల్స్..

వందలాది పార్సిల్స్..

అమెజాన్, ప్లిప్ కార్ట్‌కు చెందిన వందలాది పార్సెల్స్ గువాహటి రైల్వేస్టేషన్ నుంచి దించుతున్నారు. అయితే రైలు నుంచి దించే క్రమంలో విసురుతున్నారు. వర్కర్లు దారుణంగా బీహేవ్ చేశారు. కొన్ని పార్సెల్స్ సీలింగ్ ఫ్యాన్‌ను తాకినట్టు వీడియోలో చూపించింది. దానిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఘటన ఈ మార్చి 24వ తేదీన జరిగిందట.. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీడియో వైరల్

34 సెకన్ల నిడివి గల వీడియోను అహ్మద్ కబీర్ షేర్ చేశారు. రైల్వేలు మీ పార్సెల్స్ ఎలా చూస్తున్నాయో చూడండి అంటూ కామెంట్ చేశారు. వీడియో వైరల్ కాగా.. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే స్పందించింది. ఆ పార్సిల్ వేస్తోన్న వ్యక్తులే దానికి బాధ్యులు అని పేర్కొంది. కాంట్రాక్ట్ పద్దతిలో పార్సిల్ బుకింగ్‌ను అందజేస్తోందని తెలిపింది. ఒప్పందం ప్రకారం.. గమ్యస్థానం, లేదంటే మధ్య స్టేషన్ వద్ద పార్సిల్ లోడ్ చేయడం/ ఆన్ లోడ్ చేయడం వారి బాద్యత అని తెలిపింది.

కఠిన చర్యలు

కఠిన చర్యలు

ఇష్యూపై అమెజాన్ కూడా స్పందించింది. పార్సిల్ విసిరేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమది కస్టమర్ల ప్రయోజనాల కోసం పాటుపడే కంపెనీ అని.. డెలివరీ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతుంది. వీడియో పాతదే.. అయినప్పటికీ చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే వాటిలో గాజు లాంటి వస్తువులు ఉంటే సంగతి ఏంటీ అని అడుగుతున్నారు. నిజమే.. పగిలే వస్తువులు ఉంటే.. అంతే సంగతులు.

English summary
video from Guwahati railway station has been doing rounds on Twitter, where hundreds of parcels from retailers like Amazon, Flipkart can be seen tossed around as they are unloaded from a train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X