మేమంత బిజేపి కార్యకర్తలం ,మోది అధికారంలోకి రావాలి :గవర్నర్ కల్యాణ్ సింగ్
రాష్ట్రాల గవర్నర్లు ఏ పార్టీ నుండి ఎన్నికైన వారు పార్టీలకు అతితంగా రాజ్యంగ బద్దంగా వ్యవహరించాలి, అయితే అందుకు విరుద్దగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ పార్టీకి చెందిన వారు ఆపార్టీకి కొమ్ముకాస్తున్నారు. అనుకోకుండానో ,లేక కావాలనో , వారు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.దీంతో వారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఆలీగఢ్ లోని కల్యాణ్ సింగ్ నివాసం ముందు ,లోక్ సభ ఎన్నికలకు భాజపా ఖారారు చేసిన స్థానిక అభ్యర్థి పై ఉన్న వ్యతిరేకత తో కొంతమంది భాజపా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.దీనిపై స్పందించిన ఆయన నరేంద్రమోదీయో తిరిగి ప్రధాని కావాలంటూ వ్యాఖ్యానించారు.మేమంతా బిజేపి కార్యకర్తలం, దాని ప్రకారం బిజేపి గెలవాలని మేము ఖచ్చితంగా కోరుటుంటామని అన్నారు.ఇది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని,మోది ప్రధాని కావడం దేశానికి ,సమాజానికి ఎంతో అవసరమని కల్యాణ్ సింగ్ అన్నారు.కాగా ఆయన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే,












Click it and Unblock the Notifications