బీజేపీకి మద్దతు: తండ్రితో విభేదించిన కూతురు సుప్రియ
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు (ఎన్సీపీ) సరికాదని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎన్సీపీ ఎలా మద్దతు ఇస్తుందని ఆమె ప్రశ్నిచారు.
ఫడ్నవీస్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించి, పార్టీ పొరపాటు చేసిందని సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. శరద్ పవార్ కూతురు సుప్రియా సులే, మాజీ మంత్రి జయంత్ పాటిల్ తదితరులు దీని పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా, మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనేదీ తమకు లేదని శరద్ పవార్ బుధవారం పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావిస్తే తమ నిర్ణయం మారుతుందన్నారు. పూణే సమీపంలోని అలీబూగ్‌లో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు.

అంతకుముందు రోజు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్ధితులు చూస్తుంటే మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని, అందురు పార్టీ కార్యకర్తలు సిధ్దంగా ఉండాలని అన్నారు. మహారాష్ట్రలో రాయగడ్ జిల్లాలోని అలీబేగ్‌లో రెండు రోజులపాటు పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. తొలిరోజు ఈ శిక్షణ శిభిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
అయితే, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ వ్యాఖ్యల పైన శివసేన బుధవారం మండిపడింది. రాజకీయాలపై అపనమ్మకం ఉన్నవారే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని తమ పత్రిక సామ్నాలో విమర్శించింది.












Click it and Unblock the Notifications