ఎల్లకాలం హైదరాబాద్‌లో ఉండలేం, చూడాలి: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎల్ల కాలం హైదరాబాదులోని కొనసాగించడం సాధ్యం కాదని కేందర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరితగతిన రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. అయితే, రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

రైలు చార్జీల పెంపుదలను ప్రజలు అర్థం చేసుకున్నారని, గత ప్రభుత్వ పాలనలో లోపాల వల్లనే రైలు చార్జీలు పెంచాల్సి వచ్చిందని వెంకయ్య వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళను తాము అధిగమించి ముందుకు సాగుతామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సాధ్యమైనంత త్వరగా రాజధానిని మార్చాలనే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications