తర్వాత నిజమైన దాడులు, వదిలిపెట్టరు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల తర్వాత తమపై నిజమైన దాడులు జరుగుతాయని భావిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ చీప్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిజెపిని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఓ పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంపై తనపై, తమ పార్టీ నాయకులపై గుడ్ల దాడులు, చెప్ప దెబ్బల వంటివి జరిగాయని ఆయన అన్నారు. అంతకన్నా పెద్ద దాడులు ఎన్నికలు ముగిసే వరకు జరగవని, అలా జరిగితే పరిస్థితి ఎదురు తిరుగుతుందని ఆయన అన్నారు.

నిజమైన దాడులు ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతాయని, వారు తమను వదిలిపెట్టబోరని ఆయన అన్నారు. కేజ్రీవాల్ తన ప్రసంగంలో బిజెపి పేరు ఎత్తలేదు. అయితే, బిజెపిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడరనేది మాత్రం అర్థమవుతోంది.
అధికారంలోకి రావడానికి వారు ఏమైనా చేస్తారని ఆయన అన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారు చాలా శక్తివంతులని, వారు కేవలం ధనబలంతో మాత్రమే పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. సత్యపథం అవసరమని, ఢిల్లీలో ఎన్నికలు అలాగే జరిగాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications