ఉచిత బస్సు ప్రయాణం- హామీల అమలు తేదీలను ప్రకటించిన సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు అతి కీలకమైనవి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సహా అయిదు హామీలను ప్రకటించింది కాంగ్రెస్. ప్రతి ఇంటికీ ప్రతి నెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదు బదిలీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 10 కేజీల ఉచిత బియ్యం.. వంటివి ఉన్నాయి.
వాటని తన మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- ఆయా హామీలను అమలు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు. తొలి కేబినెట్‌లోనే ఆ ఫైళ్లను క్లియర్ చేశారు. ఈ హామీలను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఇవ్వాళ బెంగళూరు విధానసౌధలో జరిగిన మంత్రివర్గ సమావేశం..వాటిని ఆమోదించింది.

ఈ వివరాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ అయిదు గ్యారంటీ హామీలు అందుతాయని తేల్చి చెప్పారు. ధనిక, పేద అనే తేడాలను చూడట్లేదని స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం, భాషా వివక్ష అనేది లేకుండా ఈ పథకాలను అమలు చేస్తామని అన్నారు.

గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని సిద్ధరామయ్య తెలిపారు. 12 నెలల వ్యవధిలో వినియోగించిన విద్యుత్‌ను లెక్కించి.. ప్రతి నెలా 200 యూనిట్ల మొత్తాన్ని కుదిస్తామని తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగానికి ఎలాంటి బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
200 యూనిట్లలోపే విద్యుత్‌ను వినియోగిస్తే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. జులై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. గృహలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ అవసరమౌతుందని సిద్ధరామయ్య వివరించారు. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు ఆన్‌లైన్ 2,000 రూపాయల మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు.
జూలై 15 నుంచి ఆగస్టు 15 లోపు ప్రతి నెలా వారి ఖాతాలో డబ్బు జమ చేస్తామని అన్నారు. దీనికోసం లబ్దిదారు దరఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను పొందుపర్చాలి. దీనికి ఆధార్ కార్డ్ లింక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని సామాజిక భద్రత పెన్షన్‌గా భావిస్తామని అన్నారు.

అన్నభాగ్య పతకం కింద జూలై 1వ తేదీ నుంచి తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ కార్డుదారులందరికీ 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తామని సిద్ధరామయ్య తెలిపారు. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి ఉద్దేశించిన శక్తి హామీ జూన్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కర్ణాటకలో మాత్రమే వర్తిస్తుంది. ఏసీ, లగ్జరీ మినహా మిగిలిన అన్ని బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
యువనిధి గ్యారెంటీ కింద 2022-23లో చదివి ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లందరికీ నెలకు 3,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు 24 నెలలకు 1,500 రూపాయలను చెల్లిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. ఈ 24 నెలలలోపు ఉద్యోగం వస్తే.. ఈ హామీ వర్తించదని అన్నారు. ట్రాన్స్‌జెండర్లతో సహా అందరికీ ఆయా పథకాలు అందుతాయని అన్నారు. 180 రోజుల పాటు నిరుద్యోగులుగా ఉన్న 18 నుంచి 25 ఏళ్ల లోపు పట్టభద్రులకు ఈ హామీ వర్తిస్తుందని తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications