చౌకీదార్ నహీ : లీడర్ చాహియే, మోదీపై హార్థిక్ సెటైర్లు
గాంధీనగర్ : ప్రధాని మోదీపై కాంగ్రెస్ యువనేత హార్థిక్ పటేల్ సెటైర్లు వేశారు. దేశ ప్రజలకు కాపాలాదారుని అని మోదీ అంటోన్న నేపథ్యంలో హర్థిక్ స్పందించారు. నాకు కాపాలాదారు కావాలంటే నేపాల్ వెళ్తానని వ్యంగ్యాస్త్రం సంధించారు. నేపాల్‌లో గుర్ఖాలు ఎక్కువగా ఉంటున్నందున హార్థిక్ ఆ అంశాన్ని ప్రస్తావించారు. మూడో విడత పోలింగ్‌లో భాగంగా విరంగమ్‌లో హార్థిక్ ఓటు వేశాక మీడియాతో మాట్లాడారు.

నేపాల్ వెళ్తా
'చౌకీదార్ కావాలంటే నేపాల్ వెళ్తాను, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే ప్రధానమంత్రి కావాలి. యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే నాయకుడు కావాలి. సైన్యాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దే సేనాని కావాలి. ఒక ప్రధానమంత్రి కావాలే తప్ప .. చౌకీదార్ కాదు' అని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కీ రోల్
2015లో పాటిదార్లకు రిజర్వేషన్ కల్పించాలని జరిగిన అల్లర్ల హార్థిక్ పాత్ర ఉందని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికలు జరుగుతున్నందున తీర్పును వాయిదా వేయాలని హైకోర్టును హార్థిక్ అభ్యర్థించగా .. తిరస్కరించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications