అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పాటు: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ రాజకీయాలతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్య ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోతోందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని రాజ్‌నాథ్ తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో దేశంలో కుంభకోణాలకు కొదవలేదని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. చైనా సైనికులు మన దేశ భూభాగంలోకి ప్రవేశించినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలనను అందిస్తామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications