మహారాష్ట్రలో చేతులెత్తేసిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోం, గవర్నర్‌తో బీజేపీ నేతలు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ స్పష్టంచేసింది. తమకు సంఖ్యాబలం లేదని గవర్నర్ భగత్‌సింగ్‌కు బీజేపీ నేతలు తెలిపారు. ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి మద్దతిచ్చారని పేర్కొన్నారు. కానీ శివసేన తమను అవమానించిందని మండిపడ్డారు.కాసేపటి క్రితం బీజేపీ నేతలు గవర్నర్ భగత్ సింగ్‌తో కలిసి ఈ విషయాన్ని తెలిపారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 105 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. శివసేనతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది. కానీ శివసేన సీఎం పదవీ రెండున్నరేళ్లు కావాలని మెలిక పెట్టడంతో పొత్తు పొడవలేదు. దీనిపై చర్చొపచర్చలు జరిపిన ప్రయోజనం లేకపోయింది. దీంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని బీజేపీ నేతలు గవర్నర్‌కు తెలిపారు.

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన బీజేపీని బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. సోమవారం వరకు గడువు విధించారు. కానీ శివసేన మాత్రం పట్టువీడకపోవడంతో చేసేదేమీ లేక బీజేపీ చేతులెత్తిసింది. ఇది మహారాష్ట్రలో కీలక పరిణామం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కూటమి సుముఖంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సీట్లు కావాలి.. కానీ ఈ మూడు పార్టీల మెజార్టీ 155 సీట్లకి చేరనుంది. అయితే వీరి మధ్య విభేదాలు లేకుండా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

we wont form government bjp leaders to governor

తాము బీజేపీ అభ్యర్థిని సీఎంగా అంగీకరించబోమని శివసేన తేల్చిచెప్పింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను సీఎంగా అంగీకరిస్తామని చెప్పి తన వ్యుహాన్ని చాటుకొంది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా అంగీకరించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+