నైరుతి రుతు పవనాల కదలికలు ఈ సారి ఎలా ఉండబోతున్నాయ్: సాధారణం కంటే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రమంగా ఎండ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. దక్షిణాది సహా పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్ రేంజ్‌లో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల వాతావరణం చల్లగా మారింది. మధ్య భారతం ఉపరితలంలో ఏర్పడిన తుఫాన్ తరహా పరిస్థితులే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వడగళ్ల వానలు కురవడం, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సారి నైరుతి రుతు పవనాలు సకాలంలో ప్రవేశిస్తాయని స్కైమెట్ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండటానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా- దేశవ్యాప్తంగా ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో 103 శాతం మేర వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. గత ఏడాది వర్షాకాలంతో పోల్చుకుంటే ఈ సారి 75 శాతం మేర అధికంగా వర్షాలు కురుస్తాయనీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల లాంగ్ పీరియర్ యావరేజ్ (ఎల్‌ఫీఏ) 103 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జీపీ శర్మ చెప్పారు.

ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కావడానికి 60 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడానికి 15 శాతం మేర అవకాశాలు ఉన్నాయని జీపీ శర్మ పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల రేంజ్ 96 శాతం నుంచి 104 శాతం వరకు ఉంటుందని, సగటున 103 శాతం వరకు దీని రేంజ్, వర్షపాతం నమోదు కావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని వివరించారు. వరుసగా మూడో ఏడాది కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. గత రెండు సీజన్లలోనూ వరుసగా సాధారణం కంటే అధికంగా వర్షాలు పడ్డాయని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications