గంటలో పెళ్లి.. ఇనుప రాడ్ తో కొట్టి వధువును హతమార్చిన వరుడు!

మేళతాళాలతో వేదమంత్రాలతో చేసుకునే పెళ్లికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. పెళ్లంటే వధూవరులు ఇద్దరు తమ జీవితాన్ని, తమ భవిష్యత్తును నిర్దేశించుకుని పెద్దలందరికీ సమక్షంలో చేసుకునే ఒక జీవితకాల ఒప్పందం. అటువంటి పెళ్లిళ్లు ఇటీవల కాలంలో అర్థం పర్ధం లేకుండా తయారవుతున్నాయి. వివాహానికి ముందు అల్లుడ్ని తీసుకొని పారిపోయిన అత్త, మరికాసేపట్లో పెళ్లి అనగా మామతో పరారైన కోడలు, ఇలా విచిత్రమైన సంఘటనలు ప్రతి ఒక్కరు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

గంటలో పెళ్లి.. వధువును చంపేసిన వరుడు
తాజాగా ఒక గంటలో పెళ్లి అవుతుంది అనగా తాళి కట్టాల్సిన వరుడు పెళ్లి కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇది విన్న ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తుంది. ఇంతకు ఏం జరిగిందంటే గుజరాత్లోని భావ్ నగర్ లో మరో గంటలో పెళ్లి జరుగుతుంది అనగా ఊహించని దారుణ ఘటన చోటుచేసుకుంది. తాళి కట్టాల్సిన వరుడు పెళ్లి కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చాడు.

Wedding in an hour Groom kills bride by hitting her with an iron rod

సహజీవనం ఆపై పెళ్లి నిర్ణయం
ఒక చిన్న విషయంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం పెళ్లి కుమార్తె ప్రాణాలను బలి తీసుకోగా, పెళ్ళికొడుకు హంతకుడిగా మారాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సాజన్ బరయ్య అనే వ్యక్తి, సోనీ రాథోడ్ అనే యువతి ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

పెళ్ళికి గంట ముందు చీర విషయంలో వివాదం.. ఇనుపరాడ్ తో దాడి చేసిన వరుడు
శనివారం రాత్రి వీరి వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లికి కేవలం గంట ముందు పెళ్లి చీర విషయంలో, డబ్బుకు సంబంధించిన విషయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక దీంతో ఆగ్రహానికి గురైన సాజన్, సోనీ పై ఇనుప రాడ్ తో దాడి చేశాడు. ఆపై ఆమె తలను బలంగా గోడకు కొట్టాడు. దీంతో సోనీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

వధువును చంపి వరుడు పరారీ.. కేసు నమోదు
ఈ ఘటనతో భయాందోళనకు గురైన నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఇక సోనీ మృతి చెందిందని చూసిన పెళ్లికి వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సాజన్ ను పట్టుకోవడానికి బృందాలను రంగంలోకి దింపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+