మళ్లీ కరోనా విజృంభణ: వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి 8 జిల్లాల్లో, 14 జిల్లాల్లో 5-10 శాతం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. 33 రోజుల తర్వాత భారతదేశంలో ప్రతిరోజూ 10,000 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటూ.. దేశ ప్రజలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో గత వారం సగటున రోజుకు 8,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసు పాజిటివిటీ రేటు 0.92% వద్ద ఉందని, ఎనిమిది జిల్లాల్లో వారానికో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉండగా, 14 జిల్లాల్లో 5-10% ఉందని ఆయన తెలిపారు.

భారతదేశపు కోవిడ్ -19 వ్యాప్తిని సూచించే ఆర్ నాట్ విలువ 1.22 ఉందని, కేసులు పెరుగుతున్నాయి, తగ్గడం లేదని వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తులు ఓమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌కు గురయ్యారని, ఇది సమాజంలో క్రమంగా వ్యాపిస్తోందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ గురువారం చెప్పారు.
దేశ రాజధానిలో ఇప్పటివరకు సీక్వెన్స్ చేసిన 115 శాంపిల్స్‌లో 46 కొత్త స్ట్రెయిన్‌కు పాజిటివ్ పరీక్షించాయని జైన్ చెప్పారు. భారతదేశంలో బుధవారం 13,154 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 82,402 కాగా, మరణాల సంఖ్య 4,80,860కి చేరుకుంది. గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252 కేసులతో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 961కి పెరిగింది. 961 కేసులలో, 320 ఓమిక్రాన్ బాధితులు కోలుకున్నారు.
కాగా, ఢిల్లీ, ముంబై నగరాల్లో కోవిడ్ ఆర్ విలువ 2 దాటినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అంతేగాక, ఈ నగరాల్లో కరోనా వైరస్ విస్తృత వేగంతో వ్యాపిస్తుందని పేర్కొనడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే ఈ నగరాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటడం గమనార్హం.












Click it and Unblock the Notifications