Ajit Pawar:అజిత్ పవార్ చివరి ఫోన్ కాల్ ఇదే..! కుప్పకూలుతున్న వేళ..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ (ajit pawar) గత వారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇది నిజంగానే ప్రమాదమా లేక కుట్ర ఏమైనా ఉందనే విషయం తేల్చేందుకు ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి సమయంలో అజిత్ పవార్ అదే విమానంలో నుంచి చివరి నిమిషాల్లో ఏం చెప్పారో వెల్లడించే ఓ ఫోన్ కాల్ బయటికి వచ్చింది. ఆయన చేసిన ఆ చివరి ఫోన్ కాల్ ఎవరికో కాదు ఆయన బంధువు, పార్టీ నేత శ్రీజిత్ పవార్ కే.
అజిత్ చివరి కాల్ ఆయనకే (ajit pawar)
అజిత్ పవార్ విమానం ఎక్కిన తర్వాత తమ పార్టీ నేత, బంధువు కూడా అయిన శ్రీజిత్ పవార్ కు కాల్ చేశారు. అంతకు ముందే ఆయన పంపిన ఓ మెసేజ్ చదివిన పవార్.. దీనికి స్పందనగా ఈ కాల్ చేశారు. ఇందులో ఆయన మహారాష్ట్రలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడారు. జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో మాలి వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సూచిస్తూ అజిత్ పవార్‌కు శ్రీజిత్ పవార్ పంపిన మెసేజ్ కు స్పందనగా ఈ ఫోన్ కాల్ చేశారు.

అజిత్ పవార్ చివరి మాటలివే..
ఇందులో అజిత్ పవార్.. మనం అన్ని వర్గాలను మనతో పాటు తీసుకెళ్తున్నామని శ్రీజిత్ కు చెప్పారు. తన చివరి శ్వాస వరకు కుల మతాలకు అందరితో కలిసి పనిచేశారని ప్రపంచానికి తెలియజేయాలని కోరుకున్నానన్నారు. మనం అందరినీ కలిపి ముందుకు సాగాలన్నారు. ఈ మాటలు మాట్లాడుతుండగానే ఆ విమానం కుప్పకూలిపోవడం, అందులో ఉన్న అజిత్ చనిపోవడం జరిగిపోయాయి. దీంతో అటువైపు ఉన్న శ్రీజిత్ పవార్ కాల్ కట్ అయిందని అనుకున్నారు. కానీ ప్రమాదం నేపథ్యంలో తాజాగా పార్టీ నేతల భేటీలో ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ను ఆయన బయటపెట్టారు. ఈ సందర్భంగా అజిత్ దాదా గొప్పతనాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఈ కాల్ రికార్డింగ్ ను ఆయన దర్యాప్తు అధికారులకు పంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications