బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు, పదిమంది మృతి
కోల్‌కతా: పశ్చిమ బంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌లో గురువారం ఉదయం బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో వేగంగా వస్తున్న ఓ క్వారీ లారీ రెండు ప్రైవేటు బస్సులను ఢీకొన్నాయి. ఈ ఘటన జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై జరిగింది. క్వారీ లారీ కరీంనగర్ నుంచి కాకినాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

సోదరిని గొడ్డలితో నరికి చంపిన అన్న
సోదరితో గొడవపడి ఆవేశంలో గొడ్డలితో నరికి చంపిన అన్న ఉదంతం కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలో గురువారం జరిగింది. ఆత్మకూరుకు చెందిన రాజంలింగం గురువారం ఉదయం తన సోదరి లతపై ఆగ్రహంతో గొడ్డలితో కర్కశంగా నరికి చంపాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications