• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలు : మమతా బెనర్జీ నామినేషన్ పై బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ అభ్యంతరం

|

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ భాబానీ పూర్ అసెంబ్లీ ఉపఎన్నికలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను అఫిడవిట్ లో వెల్లడించలేదని బిజెపి అభ్యర్థి టిబ్రెవాల్ ఆరోపించారు.

హుజురాబాద్ లో యుద్ధం మొదలైంది.. కేసీఆర్, హరీష్ లకు దమ్ముంటే ఆ పని చెయ్యాలన్న ఈటల రాజేందర్హుజురాబాద్ లో యుద్ధం మొదలైంది.. కేసీఆర్, హరీష్ లకు దమ్ముంటే ఆ పని చెయ్యాలన్న ఈటల రాజేందర్

క్రిమినల్ కేసులు వెల్లడించలేదని.. మమత ఎన్నికల అఫిడవిట్ పై బీజేపీ అభ్యర్థి అభ్యంతరం

క్రిమినల్ కేసులు వెల్లడించలేదని.. మమత ఎన్నికల అఫిడవిట్ పై బీజేపీ అభ్యర్థి అభ్యంతరం

ఈ క్రమంలో ప్రియాంకా టిబ్రెవాల్ ఎన్నికల ఏజెంట్ సాజల్ ఘోష్ భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి రాసిన లేఖలో బెనర్జీపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన అనేక వార్తా నివేదికలను కూడా పేర్కొన్నారు. 2014 లో బిజెపిలో చేరిన ప్రియాంకా బిజెపి యువజన విభాగానికి పశ్చిమ బెంగాల్ ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై విచారణల సమయంలో కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బిజెపి తరఫున ప్రాతినిధ్యం వహించి గట్టిగా వాదించారు.

 నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంకా టిబ్రేవాల్ .. ఎన్నికల ప్రచారం మొదలు

నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంకా టిబ్రేవాల్ .. ఎన్నికల ప్రచారం మొదలు

సోమవారం తన నామినేషన్ దాఖలు చేసిన తరువాత మాట్లాడిన టిబ్రేవాల్, భబానీపూర్ అసెంబ్లీ సీటు కోసం తన యుద్ధం "అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రజల న్యాయం కోసం పోరాటం" అని వ్యాఖ్యానించారు. భబానీపూర్ ప్రజలకు పెద్ద అవకాశం వచ్చిందని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి, వారు ముందుకు వచ్చి బిజెపికి ఓటు వేసి చరిత్ర సృష్టించాలని ఆమె అన్నారు.
భాబానీపూర్ ప్రాంతంలోని గోడపై భాజపా చిహ్నం అయిన కమలం గీయడం ద్వారా న్యాయవాది ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

మమత కోసం పోటీ నుండి తప్పుకున్న కాంగ్రెస్ .. టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరు

మమత కోసం పోటీ నుండి తప్పుకున్న కాంగ్రెస్ .. టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరు

ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించి తీరుతామని చెప్తున్నారు. శనివారం, ఆమె దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ దేవాలయాన్ని సందర్శించి, కాళీ దేవికి పూజలు నిర్వహించిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని పాలక ప్రభుత్వంపై ఆమె తన పోరాటాన్ని సాగిస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని తాము నిలపటం లేదని కాంగ్రెస్ ప్రకటించడంతో ప్రధానంగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ల మధ్యనే పోటీ నెలకొంది.

నవంబర్ 5 లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయితేనే సీఎంగా మమతా బెనర్జీ

నవంబర్ 5 లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయితేనే సీఎంగా మమతా బెనర్జీ

ముఖ్యంగా, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిపై ఘనవిజయం సాధించిన మమతా బెనర్జీ తాను పోటీ చేసిన అసెంబ్లీ స్థానం నుండి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అసెంబ్లీ సభ్యురాలిగా ఏదైనా నియోజకవర్గం నుండి గెలవాల్సి ఉంది. నవంబర్ 5 లోపు ఆమె విజయం సాధించి ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగడానికి అర్హత సంపాదించాల్సి ఉంది. నందిగ్రామ్‌లో ఆమె మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సువేందు అధికారితో 1,956 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తరువాత, శోభందేబ్ చటోపాధ్యాయ్ భబానీపూర్ నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ మమతా బెనర్జీ పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇక పశ్చిమ బెంగాల్ లో ఉపఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 30న జరగనుండగా, అక్టోబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
Bharatiya Janata Party (BJP) candidate Priyanka Tibrewal on Tuesday strongly objected to the nomination filed by Trinamool Congress (TMC) chief and West Bengal Chief Minister Mamata Banerjee. BJP candidate Tibrewal alleged that Mamata Banerjee did not disclose the criminal cases pending against her in the affidavit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X