ప్రధాని మోదీకి చంద్రబాబు సన్నిహితురాలు సవాల్..దమ్ముందా అంటూ వెటకారం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. మోదీకి బహిరంగ సవాల్ విసురుతూ, ధైర్యం ఉంటే తనతో లైవ్ డిబేట్‌కు రావాలని, ఎన్నికలు రేప్పొద్దునే వచ్చినా తమ పార్టీ సిద్ధమేనని ధీమా వ్యక్తం చేశారు.నాతో లైవ్ డిబేట్‌లో కూర్చోవాలని సవాల్ విసురుతున్నా. కావాలంటే మీ టెలీప్రాంప్టర్ కూడా తెచ్చుకోవచ్చు అంటూ మమత మోదీని వెటకారమాడారు. ఇది మోదీ ప్రసంగాల్లో టెలీప్రాంప్టర్ వాడకంపై ఉన్న విమర్శలను ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది.
బీజేపీ నేతలు "ఆపరేషన్ బెంగాల్" ప్రారంభించాలని చేసిన వ్యాఖ్యలపై మమత తీవ్రంగా మండిపడ్డారు. విపక్ష నేతలు అంతర్జాతీయంగా దేశం కోసం పాటుపడుతుంటే, స్వదేశంలో కేంద్రం మాత్రం రాజకీయాలు చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ప్రధాని మాటలు విని విస్తుపోయా. ఇది చాలా బాధాకరం. విపక్షాలన్నీ కలిసి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దేశం కోసం ధైర్యంగా ముందడుగేశాయి. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సిందూర్ చేసినట్లు ఆపరేషన్ బెంగాల్ చేస్తామని ప్రధాని మోదీ, బీజేపీ నేతలు అనడం కరెక్టేనా? అని మమత ప్రశ్నించారు.

"ఆపరేషన్ సిందూర్"ను రాజకీయ మైలేజీ కోసం వాడుకోవడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. మా ఎంపీ అభిషేక్ బెనర్జీ వెళ్లి అంతర్జాతీయంగా భారత్ కోసం మాట్లాడుతున్నారు. ప్రధాని మాత్రం విపక్షాల్ని, మా ప్రభుత్వాన్ని విమర్శించడంలో బిజీగా ఉన్నారు. వీళ్లంతా ఇక్కడ పొలిటికల్ హోలీ ఆడుతున్నారంటూ మమత ఎత్తిపొడిచారు.
బెంగాల్‌లో అసలు చట్టమే లేదని, గూండాయిజమే రాజ్యమేలుతోందని మోదీ చేసిన వ్యాఖ్యలకు మమత గట్టి కౌంటర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో జరిగింది చూసిన తర్వాత మీకు సిగ్గనిపించలేదా? రోడ్డు మీద బ్లూఫిల్మ్ ప్లే చేశారే అని ఆమె అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఒక హైవేపై ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెప్పినప్పటికీ, సదరు వ్యక్తి భార్య బీజేపీ నేత కావడం విశేషం.












Click it and Unblock the Notifications