వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఢిల్లీపర్యటన..ఈడీ విచారణల వేళ.. ప్రధాని మోదీతో భేటీ!!

|
Google Oneindia TeluguNews

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కూడా కలవనున్నట్లు గా సమాచారం. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన మమతాబెనర్జీ ప్రధాని మోడీని కలవనుండడం దేశ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

మోడీని కలవనున్న మమతా బెనర్జీ ..

మోడీని కలవనున్న మమతా బెనర్జీ ..

ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు. ఆ తర్వాత ఆరు గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలుస్తారని సమాచారం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ ఉపాధి హామీ నిధులు మరియు జీఎస్టీ బకాయిలతో సహా పలు అంశాలపై మమతా బెనర్జీ ప్రధాని మోడీ తో చర్చించనున్నారని సమాచారం . పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయుల నియామక స్కామ్ నేపథ్యంలో అర్పితా ముఖర్జీ ప్లాట్ల లో భారీ మొత్తంలో నగదు, బంగారం రికవరీ చేయడంతో గత వారం అన్ని పార్టీ పదవుల నుంచి తొలగించిన పార్థ ఛటర్జీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న తరుణంలో మమత పర్యటన రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది.

మమత తన ఎంపీలతో భేటీ ..ఈడీ దాడులపై చర్చ

మమత తన ఎంపీలతో భేటీ ..ఈడీ దాడులపై చర్చ

కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఈడీని ప్రయోగిస్తున్న సమయంలో తన పార్టీ ఎంపీలతో మమతా బెనర్జీ భేటీ నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా హాజరైన ఈ సమావేశంలో, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉమ్మడి ప్రతిపక్షాల ఎత్తుగడలను, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై దాడి చేసి అరెస్టు చేయడానికి బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమోదించారు.

పార్లమెంట్ మిగతా సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

పార్లమెంట్ మిగతా సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

అలాగే, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో మిగిలిన భాగంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అనుసరించే వ్యూహాన్ని అభిషేక్ ఈ సమావేశంలో వివరించినట్లు తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికల గురించి కూడా బెనర్జీ ఎంపీలతో చర్చించారని తెలుస్తుంది. ఆమె ఇటీవల ప్రకటించిన పశ్చిమ బెంగాల్‌లోని ఏడు కొత్త జిల్లాల పేర్ల కోసం వారి నుండి సలహాలను కూడా కోరినట్టు తెలుస్తుంది.

 ఆగస్టు 7న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న మమతా బెనర్జీ

ఆగస్టు 7న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్న మమతా బెనర్జీ

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న మమత ఆగస్టు 7న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారని చరణ్. గత ఏడాది కౌన్సిల్ ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకాలేదు. అలాగే, మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తున్న పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా మమత బెనర్జీ కలవవచ్చు అని సమాచారం.

English summary
West Bengal CM Mamata Banerjee is scheduled to meet PM Narendra Modi to discuss the multiple issues along with MGNREGA and GST dues for her state. political interest on mamata banerjee's meet with modi at the time of ED probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X