కరోనా కబళింపు: మమతా బెనర్జీ సోదరుడు మృతి..
కరోనా రక్కసి జడలు విప్పి నాట్యం చేస్తోంది. వైరస్ వివిధ రూపాంతరాలు చెందుతోంది. దీంతో యువత ఎక్కువగా చనిపోతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిన్న తమ్ముడు ఆషీమ్ బెనర్జీ కూడా అసువులు బాశాడు. కరోనా సోకిన అషీమ్‌ను కోల్‌కతాలో గల ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడే ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోయారు.
బెంగాల్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 20 వేల కేసులు వచ్చాయి. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 10.94 లక్షలకు చేరింది. శుక్రవారం 136 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 12 వేల 993కి చేరింది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ వస్తున్నాయి. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కరోనాతోపాటు.. బ్లాక్ ఫంగల్, ఇతర వైరస్ వ్యాప్తి కూడా ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications