కత్తులు, కర్రలు, బాంబులు.. ఓటర్లలో భయం భయం: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో విధ్వంసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారు కత్తులు, బాంబులు, కర్రలతో దాడులకు పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాలెట్ బాక్స్‌లను కాల్చారు. దాదాపు బెంగాల్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అధికార టీఎంసీ పార్టీ వారు.. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను భయాందోళనకు గురి చేసారు. కర్రలతో దాడి చేయడంతో ఓటర్లు పరుగులు పెట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ చోట బీజేపీ ఎన్నికల ఏజెంట్ పైన కత్తితో దాడి చేశారు. చాలాచోట్ల విధ్వంసం సృష్టించారు. బీర్బారాలో కర్రలు చేతబట్టుకొని మరీ టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లాలని బెదిరించారు. కొన్ని చోట్ల బాంబులు విసిరారు. నటబరిలో బీజేపీ పోల్ ఏజెంటును టీఎంసీ మంత్రి కొట్టారు.

పలు జిల్లాల్లో విధ్వంసం
పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఉత్తర 24 పరగణాలు, బుర్ద్వాన్, కూచ్‌బెహర్, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

పోలింగ్ కేంద్రం వద్ద పేలిన బాంబు
బాగ్దాలోని పోలింగ్ కేంద్రంలో కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి బ్యాలెట్ పత్రాలపై ముద్రలు వేసేందుకు ప్రయత్నించారు. ఇక్కడ దాడి కూడా జరిగింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద బాంబు పేలింది. ఈ ఘటనలోను పలువురు గాయపడ్డారు.

ఇళ్లు తగలబెట్టారని సీపీఎం ఆరోపణ
దక్షిణ 24 పరగణాలు జిల్లాలో సీపీఎం మద్దతుదారుల ఇల్లు గత రాత్రి తగలబెట్టారని, ఆ ఇంట్లోని భార్య, భర్త చనిపోయారని సీపీఎం పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కొందరు వ్యక్తులు మీడియా వాహనంపై దాడి చేశారు. కూచ్ బెహర్ జిల్లాలోని శుట్కబరి ప్రాంతంలో తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ టీఎంసీ కార్యకర్త సహా 20 మంది గాయపడ్డారు. టీఎంసీ, అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మధ్య ఘర్షణ కారణంగా ఈ పేలుడు చోటు చేసుకుంది.

బీజేపీ, సీపీఎం ఫిర్యాదులు
బుర్ద్వాన్ జిల్లాలోను హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అధికార టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని, పలుచోట్ల పోలింగ్ బూత్‌ల పైకి బాంబులు విసిరారని బీజేపీ, సీపీఎం ఈసీకి ఫిర్యాదు చేశాయి. అయితే, టీఎంసీ ఈ ఆరోపణలు ఖండించింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications