బెంగాల్ లో కొత్త చరిత్ర, దూసుకెళ్తున్న బీజేపీ - ఫలితాల్లో మమతకు భారీ షాక్ ..!!
పశ్చిమ బెంగాల్ తొలి ఫలితాల పై స్పష్టత వస్తోంది. ట్రెండ్స్ ప్రజా నాడిని వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయా లేదా అనే టెన్షన్ వేళ వాస్తవ ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్.. ఆ తరువాత ఈవీఎం ల కౌటింగ్ ప్రారంభించారు. తొలి ఫలితాల్లో టీఎంసీ కంటే బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరులో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ లో తొలి ఫలితాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ కు అనుగుణంగా బీజేపీ 50 నియోజకవర్గాల్లో.. మమతా పార్టీ టీఎంసీ 30 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. పలు చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలుండగా, నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈసీ రద్దుచేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత మూడు ఎన్నికల్లో తిరుగులేని విజ యం సాధించిన టీఎంసీ నాలుగోసారి విజయంపై ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్‌లో పాగా వేయాలని శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ కూడా తనదే విజయం అని చెప్పుకుంటోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువశాతం మాత్రం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే, తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమత ప్రకటించారు.

తొలి ఫలితాల్లో బీజేపీ ఆధిక్యత
మమతా పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఫలితంపైఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి నిలబడ్డారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆయన మమతను ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుందా? మమత పైచేయి సాధిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. బెంగాల్‌లో గత నెల 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా 92.47శాతం ఓటింగ్ నమోదైంది. అయితే.. తొలి ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతుండటంతో.. ఈవీఎం ల కౌంటింగ్ లోనూ ఇదే కొనసాగుతుందా లెక్క మారుతుందా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications