తమిళనాడు సీఎం గ్రూప్ లో స్లీపర్ సెల్స్ స్లీపింగ్: దినకరన్ ను నమ్ముకుంటే పదవి, పరువు !

తమిళణాడు సీఎం పళని వర్గంలో దినకరన్ స్లీపర్ సెల్స్స్లీపర్ సెల్స్ స్లీపింగ్ చేస్తున్నాయని ఎద్దేవ చేసిన మంత్రి జయకుమార్దినకరన్ ను నమ్ముకుంటే పదవులే కాదు పరువు కూడా పోతుంది, అంతే

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ ఇప్పుడు అనేక రకాలుగా ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యేలను మళ్లీ బయటకులాగాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటుపడినా టీటీవీ దినకరన్ కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు.

ఇటీవల తన వర్గంలో 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదని, ఇంకా చాల మంది ఉన్నారని మీడియాకు చెప్పిన టీటీవీ దినకరన్ సీఎంకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటకు రావడానికి వారు సిద్దంగా ఉన్నారని మీడియాకు చెప్పారు.

What about TTV Dinakarans so called sleeper cells

ప్రస్తుతం సీఎం వర్గంలోని తన స్లీపర్ సెల్స్ ను బయటకు రప్పించే ప్రయత్నాలు టీటీవీ దినకరన్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై మంగళవారం తమిళనాడు మంత్రి జయకుమార్ మాట్లాడుతూ దినకరన్ వర్గానికి చెందిన స్లీపర్ సెల్స్ ప్రస్తుతం స్లీపింగ్ (నిద్ర) చేస్తున్నాయని ఎద్దేవ చేశారు.

ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు వారి పదవులు కొల్పోయి కొడుగు రిసార్ట్ లో నిద్రపోతున్నారని వ్యంగంగా అన్నారు. దినకరన్ ను నమ్ముకుంటే పదవులే కాదు వారి పరువు కూడ పోతుందని ఇప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేస్తున్నారని మంత్రి జయకుమార్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+