ఓటర్లకు సూచనలు జారీ చేసిన ఈసీ

Lok Sabha election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలి విడత పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియనూ దశలవారీగా పూర్తి చేస్తోన్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లోని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థలు ఖరారు కావడం వల్ల ఆయా చోట్ల ప్రచారం పీక్స్‌కు చేరుకుంది.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా సరికొత్త గెజిట్‌ను జారీ చేసింది. రెండో విడత లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన గెజిట్ అది. గురువారం నుంచి రెండో దశ లోక్‌సభ నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 4. 6వ తేదీ వరకు స్క్రూటినీ ఉంటుంది.

What are the advantages of EVMs in Polling

నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 8వ తేదీ తుది గడువు. ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ ఉంటుంది. అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లల్లో రెండో విడతలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరుగుతుంది. లోక్‌సభలో ఎన్డీఏ- ఇండియా కూటమి మధ్య ప్రధానంగా ఎన్నికల పోటీ నెలకొని ఉంది.

ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తోంది ఈసీ. దీనిపై కొత్త ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక చర్యలను తీసుకుంది. దేశవ్యాప్తంగా 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 1,16,48,090 మంది ఉన్నారు. వారిలో చాలామంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందులో భాగంగా- ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. కొన్ని సూచనలను జారీ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎలా వినియోగించాలి?, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ?, పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు.

What are the advantages of EVMs in Polling

పోలింగ్ ప్రక్రియపై..

1. పోలింగ్ గదిలో ముగ్గురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. వారిలో ఒకరు ఓటరు గుర్తింపు ఐడీని చెక్ చేస్తారు. మరొకరు వేలిపై ఇంకు గుర్తును వేస్తారు. మరొకరు బ్యాలెట్ యూనిట్‌ను ప్రారంభిస్తారు.

2. ఓటరు పోలింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లినప్పుడు.. అక్కడున్న సిబ్బందిలో మూడవ అధికారి బ్యాలెట్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అప్పుడు ఈవీఎంపై ఎరుపు రంగు లైట్ వెలుగుతుంది.

3. తమకు నచ్చిన అభ్యర్థి పేరు/ఎన్నికల గుర్తు లేదా నోటాపై ఓటు వేయాలనుకున్నప్పుడు ఈవీఎం యూనిట్‌లోని నీలం రంగు బటన్‌ను నొక్కాలి. ఆ వెంటనే ఎరుపురంగు లైట్ వెలుగుతుంది.

4. ఓటు వేసిన అభ్యర్థి/నోటా, సీిరియల్ నంబర్, ఎన్నికల గుర్తు ఉన్న బ్యాలెట్ స్లిప్ వీవీప్యాట్‌లో ప్రింట్ అయి కనిపిస్తుంది. ఆ వెంటనే కంట్రోల్ యూనిట్ నుంచి బీప్ అంటూ శబ్దం వినిపిస్తుంది. దీనితో ఓటు వేసే ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్టవుతుంది.

ఈవీఎంల వల్ల ప్రయోజనాలు ఏంటీ?

1. ఓటు వేసే సమయాన్ని తగ్గిస్తుంది.

2. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వేగవంతంగా పూర్తవుతుంది.

3. హై సెక్యూరిటీ ఫీచర్లతో ఈవీఎంను రూపొందించినందు వల్ల అందులో పోల్ అయిన ఓట్లను తారుమారు చేయడం లేదా వాటిని హ్యాక్ చేయడం అసాధ్యం.

4. ఇందులో చెల్లని ఓటు అంటూ ఏదీ ఉండదు. అలాంటి అవకాశమే లేదు. ప్రతి ఓటు కూడా పరిగణనలోకి తీసుకుంటారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+