చిన్నస్వామి స్టేడియం వద్ద ఏం జరిగింది?

Bengalur stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై పోలీసులు సమగ్ర నివేదికను రూపొందించారు. దీనికి గల కారణాలను ఇందులో పొందుపరిచారు.

బెంగళూరు విధాన సౌధ వద్ద సన్మానం అనంతరం ఆర్సీబీ ప్లేయర్లంతా ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా చిన్నస్వామి స్టేడియానికి రావాల్సి ఉంది. వాళ్లను చూడటానికి విధాన సౌధ వద్ద వేల సంఖ్యలో అభిమానులు గుమికూడారు. అక్కడికి వెళ్లలేని లక్షలాదిమంది.. చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

What happened outside Chinnaswamy Stadium leads to Bengaluru stampede

ఉదయమే విధానసౌధ, చిన్నస్వామి స్టేడియం క్రిక్కిరిసిపోయాయి. ఆర్సీబీ ప్లేయర్లు బెంగళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్టు చేరుకున్నారనే సమాచారం తెలిసిన తరువాత ఈ రద్దీ మరింత పెరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియానికి అభిమానుల తాకిడి తీవ్రమైంది.

మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఒక్క విధాన సౌధ వద్దే దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు చేరుకున్నారు. కిలోమీటర్ పరిధి వరకు విస్తరించారు. ఆ తరువాత వారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. 80,000 నుంచి లక్ష మంది వరక ఫ్యాన్స్ విధానసౌధ వద్ద ఆర్సీబీ ప్లేయర్ల కోసం వేచిచూశారు.

ఈ సంఖ్య- చిన్నస్వామి స్టేడియం వద్ద రెండింతలుగా కనిపించింది. రెండున్నర నుంచి మూడు లక్షల మంది స్టేడియం వద్ద బారులు తీరారు. స్టేడియంలోకి ప్రవేశించడానికి కొన్ని పరిమితంగా ఫ్రీ పాస్ లను ఇచ్చింది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్. కొందరు వీఐపీలు, వారి కుటుంబ సభ్యులతో స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తో అనుసంధానమైన కొన్ని ట్రైనింగ్ సెంటర్లకూ కాంప్లిమెంటరీ పాస్ లను అందజేసినట్లు చెబుతున్నారు.

ఫ్రీ పాస్, టికెట్ ఉన్న వారితో పాటు లేని అభిమానులు లక్షల సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. వారిని పోలీసు యంత్రాంగం అదుపు చేయలేకపోయిందనేది ప్రధాన ఆరోపణ. స్టేడియం గేట్లను ఒక్కసారిగా తెరవడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఇది- తోపులాటకు దారి తీసింది. ఒకరినొకరు తోసుకోవడంతో కొంతమంది కిందికి పడిపోయారు.

గేట్లను తెరిచిన తరువాత పడిగాపులు పడిన అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ గుంపులుగా స్టేడియం వైపు పరుగులు పెట్టారు. పాస్, టికెట్లను తనిఖీ చేయడానికి గేట్ల వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో గందరగోళం పరిస్థితులు తలెత్తినట్లు ప్రత్యక్షసాక్షులను ఉటంకిస్తూ పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

నిజానికి- స్టేడియం సీట్ల సామర్థ్యం 35,000. లక్షలుగా జనం చేరుకోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేనిస్థితికి చేరుకున్నారు. పరిమితికి మించి అభిమానులను స్టేడియం లోనికి అనుమతి ఇస్తే- అక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందనే కారణంతో వారిని గేట్ల వద్దే అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఇది తొక్కిసలాటకు దారి తీసింది. కొందరు అభిమానులు గేట్లు, గొడలను పగలగొట్టారని, వాటిని ఎక్కి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. జనం ఈ స్థాయిలో వస్తారని ఊహించలేదని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం అంగీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+