వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. ఇప్పుడు గ్రీన్ ఫంగస్, ఇండోర్‌లో వెలుగులోకి.. లక్షణాలు ఇవే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రుపాంతరం చెందుతోంది. వైరస్ తగ్గిన ఫంగస్ రూపంలో అటాక్ అవుతుంది. తొలుత బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. తర్వాత వెంటనే వైట్ ఫంగస్ అన్నారు.. నెక్ట్స్ ఎల్లో ఫంగస్ కూడా వచ్చింది. వీటిలో బ్లాక్ ఫంగస్ డేంజర్ అని నిపుణులు తెలియజేశారు. సమ్మర్ పూర్తయి.. వానాకాలంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ కొత్తగా గ్రీన్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. గ్రీన్ ఫంగస్ అంటే ఏంటీ..? దాని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. పదండి.

Recommended Video

Green Fungus Symptoms ముక్కు నుంచి రక్తం , తీవ్ర జ్వరం | Prevention | Black Fungus | Oneindia Telugu
ఫస్ట్ కేసు

ఫస్ట్ కేసు

దేశంలో తొలిసారి గ్రీన్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కి చెందిన ఓ 34 ఏళ్ల యువకుడు కరోనా జయించిన.. గ్రీన్ ఫంగస్ బారిన పడ్డారు. అతనికి గ్రీన్ ఫంగస్ సోకిందని తెలిసిన వెంటనే.. విమానంలో ముంబై తరలించారు. బ్లాక్ ఫంగస్ కూడా మహమ్మారి అని చాలా రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత ఇప్పుడు గ్రీన్ ఫంగస్ బయటపడింది. ఇదీ కూడా డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రీన్ ఫంగస్.. బ్లాక్ ఫంగస్ కన్నా ఎలా డిఫరెంట్.. లక్షణాలు ఏంటి అని జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు.

హై ఫీవర్

హై ఫీవర్

గ్రీన్ ఫంగస్‌ను ఆస్పర్‌గిల్లొసిస్ అని కూడా అంటారు. అతి తీవ్ర జ్వరం, ముక్కు నుంచి రక్తం కారితే గ్రీన్ ఫంగస్ బారిన పడినట్టేనని నిపుణులు తెలిపారు. ఇంటిలో, బయట ఉన్న ఈ ఫంగస్ బారినపడతారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది.

ఇండోర్ వ్యక్తి గ్రీన్ ఫంగస్

ఇండోర్ వ్యక్తి గ్రీన్ ఫంగస్

ఇండోర్‌కి చెందిన వ్యక్తిని వైద్యులు పరీక్షించారు. అతనికి బ్లాక్ ఫంగస్ వచ్చిందెమోనని అనుకున్నారు. కానీ అతనికి గ్రీన్ ఫంగస్ వచ్చిందని తర్వాత నిర్ధారించారు. గ్రీన్ ఫంగస్ వస్తే ముక్కు నుంచి రక్తం కారడం, తీవ్రంగా జ్వరం, నీరసం, బరువు తగ్గడం జరుగుతుంది. ఇండోర్‌కి చెందిన వ్యక్తి ఆరోగ్యం కుదుటపడుతోంది. అతనికి పైన చెప్పిన లక్షణాలు కనిపించాయి.

క్లీన్‌నెస్..

క్లీన్‌నెస్..

ఫంగస్ వచ్చిన వారు కూడా శుభ్రమైన వాతావరణంలో ఉండాలి. దుమ్ము, నిలిచి ఉన్న నీరు పరిసర ప్రాంతాల్లో ఉండొద్దు.. ఆయా చోట్ల ఉండాలంటే ఎన్ 95 మాస్క్ ధరించాలని సూచించారు. భూమి మీద, దుమ్ము ఎక్కువగా ఉండే చోట మాత్రం ఉండొద్దు. సబ్బుతో మొహం, చేతులను పదే పదే కడుక్కొవాలి.

English summary
green fungus case detected at madhya pradesh indore. who infect fungus airlift to mumabai for better treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X