వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాటిలైట్ ఇంటర్నెట్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
శాటిలైట్

"ఇది నిజానికి చాలా బాగుంది. కానీ, అప్పుడప్పుడూ ఆగిపోవడాన్ని గమనించాను. కొన్ని సార్లు, ఒక సెకను పాటు, కొన్ని సార్లు ఎక్కువ సమయం వరకూ.." అని సర్రే యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ అలాన్ వుడ్‌వర్డ్ అన్నారు.

అంతరిక్షంలోకి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ఎలాన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ కంపెనీ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాడ్ బాండ్ సేవల గురించి ఆయన మాట్లాడుతున్నారు.

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ విధానంలో భూమిపై అమర్చిన చిన్న డిష్ ద్వారా సేవలు అందుతాయి.

అయితే, శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న ఏకైక సంస్థ స్టార్‌లింక్ మాత్రమే కాదు.

2022 నాటికల్లా పూర్తిస్థాయిలో శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

తద్వారా భూమిపైన, నీటిపైన ప్రపంచంలోని ఏ మూలలోనైనా ఇంటర్నెట్ అందేలా చూడాలని భావిస్తోంది.

భారతదేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది.

స్టార్‌‌లింక్ డిష్

శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?

భూమి నుంచి అత్యంత తక్కువ ఎత్తులోనున్న కక్ష్య నుంచి శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే అవకాశం కలగడం ఆనందంగా ఉందని ప్రొఫెసర్ ఆలన్ అన్నారు.

అయితే, పావురాలు డిష్‌లపై కూర్చోవడం వల్ల బ్రాడ్ బ్యాండ్ సేవల్లో అంతరాయం తలెత్తొచ్చని ఆయన భావిస్తున్నారు.

వంటగది పైకప్పుపై ఉండే చిన్న సిమెంటు రంగులోనున్న డిష్‌ను చూసి పావురాలు ఆధునిక స్నానపు తొట్టెలా భావిస్తూ ఉండి ఉండవచ్చని ఆయన అన్నారు.

కాగా, వీటికి ఇంటర్నెట్‌ను అందించే 100,000 టెర్మినళ్లను నింగిలోకి పంపించినట్లు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించారు.

భూమి నుంచి 550కిలోమీటర్ల ఎత్తులో తిరుగురుతున్న 1700 శాటిలైట్ల నుంచి ఈ చిన్న డిష్ సంకేతాలను పంపించడం, గ్రహించడం లాంటి పనులను చేస్తుంది. ఇవి ప్రతీ 90 నిమిషాలకు భూమి చుట్టూ తిరిగేందుకు వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి.

ఇలాంటివే కొన్ని వేల శాటిలైట్లను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

కానీ, చిప్స్, లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనాల కొరత కొత్తవాటిని ప్రవేశపెట్టడంపై ప్రభావం చూపిందని స్టార్‌లింక్ సంస్థను నిర్వహిస్తున్న ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ఎక్స్ అధ్యక్షుడు గ్విన్ షాట్ వెల్ చెప్పారు.

కోవిడ్-19 రోగుల చికిత్స కోసం కమర్షియల్ ఆక్సిజన్ డిమాండు కూడా పెరిగింది. దాంతో, ఆక్సిజన్ ఇంధన కొరత ఏర్పడింది.

రాకెట్

భారీ అంతరాయం

ఇంటర్నెట్ సేవల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలకు కారణాల గురించి ప్రొఫెసర్ వుడ్‌వర్డ్ ఇంకా పరిశోధన చేపడుతున్నారు.

అయితే, స్టార్‌లింక్ ఆంటెన్నాపై పావురం కూర్చోవడం వల్లే దాని పని తీరును మందగిస్తుందని ఓ టెక్నాలజీ నిపుణుడు బీబీసీతో చెప్పారు.

కానీ, ఈ సమస్యకు పావురాలు మాత్రమే కారణం కాదు.

ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ వినియోగదారులకు ఈ వారంలో భారీ అంతరాయం చోటు చేసుకుంది. కనెక్షన్ పూర్తిగా మాయమైపోయిందని వుడ్‌వర్డ్ చెప్పారు.

అయితే, బీటా స్థాయిలోనే ఉన్న ఈ సేవలు చాలా మంది వినియోగదారులకు కొన్ని గంటల పాటు పని చేయలేదు. దీనికి కారణాలను స్టార్‌లింక్ చెప్పలేదు.

స్టార్‌‌లింక్ డిష్

స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించాలని ఆశిస్తోంది.

అమెజాన్ ప్రాజెక్ట్ క్యూపర్ ద్వారా 3236 శాటిలైట్లను లాంచ్ చేయాలని ఆలోచన చేస్తోంది.

కెనడాకు చెందిన టెలీశాట్ అంతరిక్ష కక్ష్యలోకి 298 శాటిలైట్లను ప్రవేశపెడతానని చెబుతోంది.

వన్ వెబ్ సంస్థకు ఇప్పటికే అంతరిక్షంలో హార్డ్‌వేర్ ఉంది.

ఈ వారంలో ఈ సంస్థ 34 శాటిలైట్లను ప్రారంభించింది. అంటే, 150 కేజీలున్న 288 ఆబ్జెక్టులు అంతరిక్షంలో ఉన్నాయి.

వన్ వెబ్ వ్యాపార సంస్థలకు, మారిటైమ్ వినియోగదారులకు, ప్రభుత్వానికి ఇంటర్నెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది. కానీ, ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత వినియోగదారులకు పోర్టబుల్ 5జీ సెల్స్ లాంటి సేవలతో సహా బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా అందించవచ్చు.

మారుమూల ప్రాంతాల్లో చాలా మంది శాటిలైట్ ద్వారా బ్రాడ్ బ్యాండ్‌ను పొందే అవకాశం ఉంది.

"ఈ సేవలను అందుకునే వారికి ఈ సాంకేతికత కనిపించకపోవచ్చు" అని టెక్నికల్ డెవలప్మెంట్ ఫర్ కన్సల్టెంట్స్ యాక్సెస్ పార్టనర్ షిప్ డైరెక్టర్ మైక్ థాంప్సన్ చెప్పారు.

"ఫైబర్ అందుబాటులో లేని పట్టణాల్లో ఈ శాటిలైట్ లింక్ ద్వారా ఇంటర్నెట్ అందించవచ్చు" అని చెప్పారు.

దీని ఖరీదెంత?

"దీని ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. బీటా టెస్టర్‌గా పరికరాలను పొందేందుకు 500 పౌండ్లు (సుమారు రూ.50,000), ఆ తర్వాత ప్రతీ నెలా 89 పౌండ్లు (సుమారు రూ.8900) చెల్లించాల్సి ఉంటుంది" అని ప్రొఫెసర్ వుడ్‌వర్డ్ చెప్పారు.

ఈ సంవత్సరం చివరినాటికి కొత్తగా వచ్చే డిష్ మోడళ్ల ధర ఇప్పుడున్న ధరలో సగానికి పడిపోతుందని షాట్ వెల్ చెప్పారు.

అయితే, స్టార్‌లింక్ వాడటం సులభంగా ఉందని ప్రొఫెసర్ వుడ్‌వర్డ్ చెబుతున్నారు.

వంటింటి పై కప్పు మీద ఈ డిష్ అమర్చే సౌలభ్యం ఉండటంతో ఆయన అక్కడే డిష్‌ను అమర్చినట్లు చెప్పారు.

ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు కలుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు స్టార్‌లింక్ ఒక యాప్‌ను కూడా ఇచ్చింది. దాంతో, గంటల కొలదీ అటూ ఇటూ తిరగకుండా, ఇంటర్నెట్ బాగా వస్తున్న ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు" అని తెలిపారు.

దీనిని రౌటర్‌కు అమర్చిన తర్వాత, ఈ డిష్ ఒక నిమిషం పాటు ఊగిసలాడింది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆగకుండా వచ్చిందని చెప్పారు.

ప్రతీ సెకనుకు సగటున 150-200 మెగా బైట్ల డౌన్‌లోడ్ వేగంతో, 10- 20 ఎంబీపీఎస్ అప్‍లోడ్ వేగంతో ఇంటర్నెట్ వస్తోంది.

అప్పుడప్పుడూ అంతరాయం కూడా ఉంటోందని ఆయన చెప్పారు.

స్టార్‌లింక్ ప్రస్తుతం అందిస్తున్న వేగాన్ని రెట్టింపు చేసి 300 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందిస్తామని ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో ట్వీట్ చేశారు.

అయితే, లియో శాటిలైట్ల ద్వారా వినియోగదారులు అందుకునే సేవలు విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి.

ఒక డిష్ చుట్టు పక్కల ఎన్ని డిష్‌లు ఉన్నాయనే అంశంపై కూడా ఇంటర్నెట్ వేగం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కవరేజీ ఏరియాలో ఉండే వినియోగదారుల సంఖ్యకు స్టార్‌లింక్ పరిమితి విధిస్తోంది.

ఒకే ప్రాంతంలో ఉన్న వినియోగదారులందరికీ టాప్ స్పీడ్ లభించదని సర్రే యూనివర్సిటీకి చెందిన మైఖేల్ ఫిచ్ చెప్పారు.

ఒక ప్రాంతంలో ఇంటర్నెట్ వాడే వినియోగదారులు పెరిగే కొద్దీ వేగం తగ్గుతుందని చెప్పారు.

శాటిలైట్ విధానాల మధ్య జరిగే జోక్యం వల్ల ఎదురయ్యే అవాంతరాల గురించి రెగ్యులేటర్ ఆఫ్ కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, అదంత సీరియస్ అవ్వదని ప్రొఫెసర్ ఫిచ్ అన్నారు.

అయితే, కొంతమంది దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

"సాధారణంగా వేగంగా, అంతరాయం లేకుండా పని చేసే ఇంటర్నెట్ కంటే కూడా నిదానంగా ఉండే ఇంటర్నెట్ ఉపయోగకరం" అని థాంప్సన్ చెబుతున్నారు.

అయితే, వీడియో కాన్ఫరెన్స్ లాంటి వాటికి ఆటంకం లేకుండా పని చేసే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

శాటిలైట్

కిక్కిరిసిన గగనం

లియో రోజు రోజుకీ రద్దీగా మారిపోతోంది. ఇప్పటికే ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనలను శాటిలైట్లు పాడు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు.

కానీ, కొంత మంది ఇవి ఒకదానితో ఢీకొంటాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

"స్టార్‌లింక్ ఉన్న కక్ష్యలలో సహా చాలా చోట్ల ఇలాంటి పరిణామం ఏర్పడటం చూశాం’’ అని సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హగ్ లూయిస్ చెప్పారు.

శాటిలైట్‌లు ఒకదానితో ఒకటి ఢీకొనడాన్ని ఆపడమనేది సులభంగా నిర్వహించలేని స్థాయి దాటిపోవచ్చని ఆయన హెచ్చరించారు.

అంతరిక్ష వాహకాలను సురక్షితంగా ఉంచేందుకు మరింత అధునాతన సాంకేతికత అవసరం అని ఆయన చెబుతున్నారు.

బ్రాడ్ బ్యాండ్ సేవలకున్న డిమాండును బట్టీ భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల సంఖ్య ఆధారపడి ఉంటుందని అన్నారు.

"స్టార్‌లింక్ ఖరీదైనదే కానీ, ఇది చాలా వినూత్నంగా నన్ను ఆశ్చర్యపరిచింది" అని ప్రొఫెసర్ వుడ్‌వర్డ్ అన్నారు.

"ఈ టెక్నాలజీని రెండు రోజులు వాడిన తర్వాత, భూమి నుంచి తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యలోంచి వచ్చే సంకేతాలను ఇది ఎలా గ్రహిస్తుందోననే సందేహాలు కలిగాయి".

"కానీ, ఈ అనుభవం నన్ను ఆశావహంగా ఆలోచించేలా చేసింది" అని అన్నారు.

ఆయన ఆలోచన ఆశావహంగా ఉంటుందా లేదా అనేది ఈ సాంకేతికత అభివృద్ధి చెందే విధానంపై ఆధారపడి ఉంటుంది. పావురాలపై కూడా కొంత వరకు ఆధారపడి ఉంది..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
What is Satellite Internet? How does it work
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X