వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్: యూజర్ల ట్వీట్, రెస్పాండ్ అయిన మేనెజ్‌మెంట్
సోషల్ మీడియా లేనిది పూట గడవడం లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు.. చాట్ చూడటమో.. లేదంటే స్టేటస్ చూడటమో చేస్తుంటారు. ఇక ఫేస్‌బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఫోటో పోస్ట్ చేయడం.. లైకులు.. షేర్ గురించి ఆలోచించడం.. అవును అంతలా అలవాటు పడిపోయాం. అలాంటిది సోషల్ మీడియాకు అంతరాయం కలిగితే ఆ బాధ చెప్పలేం. అవును.. వేళ్లు నడవు.. మెదడు పనిచేయవు. ఇప్పుడు వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాటిని వాడుతున్న యూజర్లు సేవలను యాక్సెస్ చేసుకువడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇతర మాధ్యమాల వేదికగా పేర్కొంటున్నారు. ఫేస్‌బుక్ యాజమాన్యంలో గల 3 యాప్స్ కొద్ది నిమిషాల నుంచి పనిచేయడం లేదని యూజర్లు పోస్టు చేస్తున్నారు. ఈ సమస్యపై స్పందించిన ఫేస్‌బుక్ "క్షమించండి, ఏదో తప్పు జరిగింది. మేము దానిపై పనిచేస్తున్నామని.. సాధ్యమైనంత త్వరగా దానిని పరిష్కరించగలమని ఫేస్‌బుక్ వెబ్ సైట్‌లో ఒక సందేశం తెలిపింది.

వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు రాత్రి 9 గంటల సమయంలో వినియోగదారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెబ్ సేవలను ట్రాక్ చేసే వెబ్ సైట్ downdetector.com ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సేవలలో సమస్యలను ఎదుర్కొన్నట్లు 20,000కు పైగా మంది ఈ సమస్య గురుంచి రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. దేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్‌కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
We’re aware that some people are having trouble accessing our apps and products. We’re working to get things back to normal as quickly as possible, and we apologize for any inconvenience.
— Facebook (@Facebook) October 4, 2021
Recommended Video
ఇంతమంది యూజర్స్ ఉంటే.. సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే వెంటనే ట్విట్టర్ ద్వారా ప్రాబ్లమ్ లేవనెత్తారు. దానికి అందరూ కామెంట్ చేయడమో.. షేర్ చేయడమే చేశారు. దీంతో ప్రాబ్లమ్ అంతటా ఏర్పడినట్టు అర్థమైంది. వీలనైంత త్వరగా ఇష్యూ సాల్వ్ చేస్తామని కంపనీ తెలియజేసింది.












Click it and Unblock the Notifications