ఆ పని చెయ్యాలనుకునేవారికి వాట్సాప్ షాక్.. యూజర్ల ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్!!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పెరుగుతున్న సైబర్ దాడులు, హ్యాకింగ్ ల నేపద్యంలో యూజర్ల ప్రైవసీని మెరుగుపరచడం కోసం కొత్త ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో కొత్త ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

సరికొత్త ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్
ఇప్పటికే 2022 ప్రారంభంలో వ్యూ వన్స్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్, ఫోటోలను, వీడియోలను రిసీవ్ చేసుకున్న వాట్సాప్ వినియోగదారుడు ఒకసారి వాటిని చూసిన వెంటనే వారి డివైజ్ నుంచి ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యేలా ఫీచర్ ను రూపొందించింది. ఇక తాజాగా అవతలి వ్యక్తి పంపించిన ఫోటో ని స్క్రీన్ షాట్ తీయడానికి, వీడియో స్క్రీన్ రికార్డు చేయడానికి వీలులేకుండా మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది.

వ్యూ వన్స్ ఫీచర్ కు కొనసాగింపుగా మరోకొత్త ఫీచర్
గతంలో తీసుకొచ్చిన వ్యూ వన్స్ ఫీచర్ కు కొనసాగింపుగా ఈ కొత్త ఫీచర్ ఉండబోతుంది. ఎందుకంటే రిసీవర్ ఒక్కసారి చూసిన తర్వాత డివైస్ నుంచి ఫోటోలు, వీడియోలు ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యేలా ఆప్షన్ పెట్టినప్పటికీ, ఫొటోలు, వీడియోలను రిసీవ్ చేసుకున్న వినియోగదారుడు వాటిని స్క్రీన్ షాట్ లేదా స్క్రీన్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటే వ్యూ వన్స్ ఫీచర్ కు అర్థం లేకుండా పోతుందని వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ను వాట్సాప్ రిలీజ్ చేయనుంది.

వాట్సప్ ఫోటోలు, వీడియోలు స్క్రీన్ షాట్ చెయ్యకుండా బ్లాకింగ్ ఆప్షన్
ఈ కొత్త ఫీచర్ తో వాట్సప్ వినియోగదారులు ఫొటోలు, వీడియోలను స్క్రీన్ షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా స్క్రీన్ షాట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ స్క్రీన్ షాట్ బ్లాక్ అవుతుంది. వార్నింగ్ మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఇక వాట్సాప్ తీసుకొస్తున్న ఈ ప్రైవసీ సెక్యూరిటీని దాటి థర్డ్ పార్టీ అప్లికేషన్లు వాడినా కూడా స్క్రీన్ షాట్ చేయలేరని, ఒకవేళ చేసినా అది బ్లాక్ గా కనిపిస్తుందని సమాచారం.

బీటా టెస్టర్ లకు రిలీజ్ అవుతున్న కొత్త ఫీచర్, త్వరలో వినియోగదారులు అందరికీ
వ్యూ వన్స్ మెసేజ్ లలో స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్ లకు రిలీజ్ అవుతున్నట్టుగా వాట్సాప్ ఫీచర్ల ట్రాకర్ WaBetaInfo పేర్కొంది. ఈ ఫీచర్ వినియోగదారులు వ్యూ వన్స్ మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ లను తీసుకోకుండా బ్లాక్ చేస్తుందని, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ సౌకర్యం ప్రస్తుతం ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ బీటా వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్ లకు అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్ పేర్కొంది. ఇక స్క్రీన్ షాట్ బ్లాకింగ్ అనేది కేవలం వ్యూ వన్స్ ఫోటోలు వీడియోలు మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టర్ లకు మాత్రమే విడుదలైన ఈ ఫీచర్ మరి కొద్ది రోజులలో అందరికీ అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications