union budget 2025: బడ్జెట్ పై మీమ్స్ వైరల్.. చూసి నవ్వుకోండి..!
A ఫర్ ఆపిల్.. B ఫర్ బాల్.. అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ బడ్జెట్-2025లో మాత్రం B ఫర్ బిహార్ అని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. అవును.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ మీమ్స్ చూస్తే మీరు కూడా B ఫర్ బిహార్ అని అంటారు. దేశంలో ఒకటే రాష్ట్రం ఉన్నట్లు అది కూడా బిహార్ అయినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వరాలు ప్రకటించి.. మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు విపక్షాల అస్త్రాలకు మీమ్స్ కూడా తోడయ్యాయి. బిహార్ బోనాంజా అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో ఉన్న మీమ్స్ ను మార్చి బిహార్ పేరుతో మీమ్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. బడ్జెట్ అనంతరం ఈ మీమ్స్ తెగ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి.
బిహార్ కు ఇచ్చిన వరాలు ఏంటి..?
బిహార్ లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ రాష్ట్రానికి అనేక వరాలు అందించింది. మఖానా బోర్డు ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, వెస్ట్రన్ కోసి కెనాల్ ప్రాజెక్ట్ కు భారీగా నిధులు కేటాయింపు, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంట్రీప్రునర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ , ఐఐటీ పట్నాలో మౌలిక సదుపాయాలు కల్పన, పూర్ణోదయ స్కీం కింద బిహార్, జార్ఖండ్, బెంగాల్,ఒడిషా,ఏపీకు అన్ని రంగాల్లో నిధులు కేటాయింపు ఇలా మొత్తం కలిపి రూ. 60వేల కోట్లతో బిహార్ కు వరాలు కేటాయించింది కేంద్రప్రభుత్వం.

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025- 26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో కీలక శాఖలకు గతం కంటే కేటాయింపులు పెరిగాయి. మొత్తం రూ.50,65,345 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక, విద్యా - మౌలిక వసతులు, ఇన్ ఫ్రా రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రానికి అధికంగా వరాలు ప్రకటించారు. బడ్జెట్ లో ఆదాయ - అప్పుల లెక్కలను వెల్లడించారు.














Click it and Unblock the Notifications