వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్‌ను 2సార్లు కలిసిన బాలీవుడ్ నటుడు, టీ పార్టీ! 4 గంటలు గడిపాడు

నటుడిగా ఉన్న పేరు ప్రతిష్టలు గొప్పవారితో పాటు అనుమానాస్పద వ్యక్తులనూ కలిసేలా చేస్తాయని, తాను కలిసిన అలాంటి వారిలో దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడని రిషీ కపూర్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో సూత్రధారి అయిన దావూద్ పాకిస్తాన్‌లో రహస్య స్థావరంలో ఉన్నాడు.

మోడీ ఎఫెక్ట్: యూఏఈలో దావూద్ ఇబ్రహీంకు షాక్, రూ.15 వందల కోట్లు స్వాధీనంమోడీ ఎఫెక్ట్: యూఏఈలో దావూద్ ఇబ్రహీంకు షాక్, రూ.15 వందల కోట్లు స్వాధీనం

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తాజాగా ఓ ఆసక్తికర విషయం చెప్పాడని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను దావూద్‌ను కలిశానని, ఆయన ఇంటికి టీ పార్టీకి వెళ్లానని, అయితే ఇది జరిగి ముప్పై ఏళ్లు కావొస్తుందని చెప్పారు.

నటుడిగా ఉన్న పేరు ప్రతిష్టలు గొప్పవారితో పాటు అనుమానాస్పద వ్యక్తులనూ కలిసేలా చేస్తాయని, తాను కలిసిన అలాంటి వారిలో దావూద్ ఇబ్రహీం కూడా ఉన్నాడని రిషీ కపూర్ చెప్పారు.

1988లో తాను దుబాయికి వెళ్లానని, తన స్నేహితుడు బిట్టూతో కలిసి దుబాయి విమానాశ్రయంలో దిగిన తర్వాత ఓ అపరిచితుడు తనను కలిసి ఫోన్లో మాట్లాడాలని కోరాడని, దావూద్‌తో మాట్లాడాలని కోరాడన్నారు.

dawood ibrahim

అప్పటికి 1993 ముంబై పేలుళ్లు చోటు చేసుకోలేదని, దావూద్ శత్రువు కూడా కాదన్నారు. తాను దావూద్ ఇబ్రహీంతో మాట్లాడానని, దుబాయికి వచ్చినందుకు ఆయన స్వాగతంపలికాడని చెప్పారు. ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానని గుర్తు పెట్టుకోవాలని చెప్పారన్నారు.

మద్యం తాగనన్నాడు

ఇంటికి రమ్మని పిలిచారని, తాము బస చేసిన హోటల్‌కు కారు పంపగా తాను ఆయన ఇంటికి టీ పార్టీకి వెళ్లానని చెప్పారు. కారు చాలా ప్రాంతాలు తిరిగి దావూద్ ఇంటికి చేరుకుందని, అతని ఇల్లు ఏ ప్రాంతంలో ఉందో కచ్చితంగా తెలియదన్నారు. మద్యం తాగనని, సర్వ్ కూడా చేయనని చెప్పాడన్నారు.

అడ్డంగా దొరికాడు.. ఫోటోలు: రైళ్లో భార్యతో 1993 పేలుళ్ల నిందితుడి రొమాన్స్!అడ్డంగా దొరికాడు.. ఫోటోలు: రైళ్లో భార్యతో 1993 పేలుళ్ల నిందితుడి రొమాన్స్!

నాలుగు గంటలు గడిపా

దావూద్ ఇంట్లో నాలుగు గంటలు గడిపానని, టీ బిస్కట్స్ ఇచ్చాడన్నారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడారని, తాను చిన్న చిన్న నేరాలు మాత్రమే చేశానని, ఎవర్నీ చంపలేదన్నారు. 1989లో మరోసారి కలిశానని, అప్పుడు తన వెంట తన భార్య కూడా ఉందని చెప్పారు.

దావూద్ చుట్టూ పదిమంది బాడీగార్డులు ఉన్నారని, సాయం కావాలంటే అడగమని చెప్పాడని, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడని, తాను తిరస్కరించానని చెప్పారు. నటుడిగా అలాంటి వ్యవహరాలకు దూరమని చెప్పానన్నారు. ఆ తర్వాత దావూద్‌తో మాట్లాడలేదన్నారు.

English summary
When Rishi Kapoor went on a tea date with Dawood Ibrahim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X