అందరిముందే ములాయం చివాట్లు, బాధపడ్డ అఖిలేష్
లక్నో: సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తన తనయుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మరొకసారి బహిరంగంగా చివాట్లు పెట్టారు. ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది.
ఓ కార్యక్రమంలో వేదికపై ములాయం మాట్లాడుతుండగా... ఆయనకు కొంత సమాచారం అవసరమైంది. రాష్ట్రంలో వరద బాధితులకు కేంద్రం సాయం పెంపు గురించి సీఎం అఖిలేశ్‌ను అడిగి తెలుసుకుందామని భావించారు.
వేదికపై ఉన్న అఖిలేశ్ యాదవ్‌ను ఆ విషయం గురించి అడిగారు. అయితే, ఆ సమయంలో పక్కన ఉన్న వారితో మాట్లాడుతున్న అఖిలేశ్ తండ్రి మాట వినిపించుకోలేదు.

దాంతో ములాయం ఆగ్రహించారు. తనయుడి తీరుకు సహనం కోల్పోయిన ములాయం వేదిక పైనే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి మందలింపుపై అఖిలేశ్ నొచ్చుకున్నట్టుగా సమాచారం. గతంలోను ములాయం తనయుడి పాలన పైన మండిపడ్డారు.
క్రిమినల్స్‌కు టిక్కెట్లివ్వం: ములాయం
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తదితర పార్టీల్లా తాము ఎన్నికల్లో క్రిమినల్స్‌కు టిక్కెట్లు ఇవ్వమని ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. గతంలో క్రిమినల్స్ అయినప్పటికీ వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని చెప్పారు.
నాగా శాంతి ఒప్పందంపై ప్రధాని వైఖరి స్పష్టం చేయాలి
నాగా శాంతి ఒప్పందం అసోం ప్రయోజనాలను దెబ్బతీయదనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేయాలని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ బుధవారం అన్నారు. రాష్ట్ర ప్రజల భయాందోళనను తొలగించడం కోసం ప్రధాని నాగా శాంతి ఒప్పందం అసోం ప్రయోజనాలను దెబ్బతీయదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని గొగోయ్ ట్విట్టర్‌లో అన్నారు.
అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే నాగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఘనత మోడీకే దక్కుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారంటూ.. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా దక్కకుండా చేసిన కీర్తి కూడా ఆయనకే దక్కుతుందా? అని గొగోయ్ ఆ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications